కేటీఆర్ చెప్పిన తాతల చరిత్ర
కేసీఆర్ పూర్వీకులు ఎక్కడివారు అన్న వెంటనే విజయనగరం అని చెప్పేస్తుంటారు. ఆ మాటను కాసేపు పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన తండ్రి.. తాతలకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు.
సిద్ధిపేటను కేసీఆర్ అడ్డాగా చెప్పుకున్నప్పటికీ.. నిజానికి తమది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అంటూ కొత్త విషయాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా విషయం అర్థం కావాలంటే.. కేటీఆర్ మాటల్లోనే వింటే సరిపోతుంది.
‘‘మాది కామారెడ్డి ప్రాంతమే. మా నాయనమ్మది దోమకొండ మండలం పోశానిపల్లె. ప్రస్తుతం కోనాపూర్. మా తాతను ఇల్లరికం తెచ్చుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు పాలనలో ఉండేది. పోశానిపల్లి వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకట్టటంతో మా భూములు మునిగిపోయాయి. ఇక్కడే వేరే చోట భూములు కొందామంటే అప్పట్లో దొరకలేదు. అప్పటికి కేసీఆర్ ఇంకా పుట్టలేదు. మా నాయనమ్మ మెదక్ జిల్లా సిద్ధిపేట మండలంలోని చింతమడకకు వెళ్లి అక్కడ భూములు కొని స్థిరపడ్డారు. ఇక్కడే భూములు దొరికి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు. అందుకే మాకు ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టం’’ అంటూ తాతల చరిత్రను కేటీఆర్ చెప్పుకొచ్చారు.