• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగ్ బ్రేకింగ్ : చైనా...

బిగ్ బ్రేకింగ్ : చైనా ల్యాబ్‌ నుండే కొవిడ్‌-19 లీక్ !

By - Tupaki Desk
Update: 2020-02-20 07:15 GMT
కోవిడ్ 19 ( కరోనా వైరస్ ) ప్రస్తుతం ప్రపంచ దేశాలని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల ఇప్పటికే రెండు వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే 80 వేలమంది ఈ వైరస్ భారిన పడి బాధపడుతున్నారు. వారిలో 95 శాతానికిపైగా చైనా వారే ఉన్నారు. అలాగే మృతుల్లో కూడా ఎక్కువ శాతం మంది చైనావారే. అయితే , ప్రస్తుతం చైనా తో పాటుగా ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కోవిడ్ 19 వైరస్‌ మూలాలు చైనాలోని ఒక ప్రయోగశాలలో ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం అవుతోన్న ఈ సమయంలో సౌత్‌ చైనా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు ఆ అనుమానం నిజమే అని చెప్తున్నారు. ‘ద పాజిబుల్‌ ఆరిజన్స్‌ ఆఫ్‌ 2019-ఎన్‌సీవోవీ కరోనా వైరస్‌’ పేరుతో వారు ఒక వ్యాసం రాశారు.

దాని ప్రకారం.. చైనాలోని ‘వూహాన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ లో గబ్బిలాలపై కొంత కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ కు కేంద్రస్థానంగా భావిస్తున్న వూహాన్‌ లోని సీఫుడ్‌ మార్కెట్‌ కు కేవలం 300 గజాల దూరంలో ఉందీ పరిశోధన కేంద్రం. ఒకరోజు ఆ కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడి పై దాడి చేశాయని.. వాటి రక్తం అతడి చర్మం పై పడిందని, వాటి మూత్రం కూడా అతడిపై పడిందని వర్సిటీ నిపుణులు తమ పత్రంలో పేర్కొన్నారు. దీంతో ఆ పరిశోధకుడు రెండువారాలపాటు స్వయం గా క్వారంటైన్‌ లో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే ఆ ల్యాబ్ నుండే ఈ వైరస్ వ్యాప్తిచెందినట్టుగా అనుమానిస్తుండగా.. ఇప్పుడు దీనికి మరింత బలం చేకూరినట్టు అయ్యింది.

ఇకపోతే , వూహాన్‌ నుంచి మన దేశానికి తరలించి ఐటీబీపీ క్వారంటైన్‌ లో ఉంచిన భారతీయులందరినీ, కరోనా పరీక్షలు పూర్తి చేసి , ఎవరికీ ఈ వైరస్ లేదు అని నిర్దారించుకొని , వారిని బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, 2022 తొలినాళ్ల నాటికి కొవిడ్‌-19 వైరస్ కు టీకా సిద్ధం అవుతుందని పుణెలోని సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటన లో తెలిపింది. అలాగే అమెరికా కు చెందిన కొడాజెనిక్స్‌ కంపెనీ తో కలిసి టీకాను సిద్ధం చేశామని.. ప్రస్తుతం దాన్ని జంతువులపై పరీక్షిస్తున్నామని, ఆరు నెలల్లో మానవులపైనా పరీక్షిస్తామని తెలిపింది.


Tags:    
  • Kovid 19 leak from China lab 
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS