• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దూకుడు పెంచిన కోరుట్ల...

దూకుడు పెంచిన కోరుట్ల ఎమ్మెల్యే .. సీఎం ఈ సారైనా కరుణించేనా ?

By - Tupaki Desk
Update: 2019-12-24 09:25 GMT
రాజకీయాలలో  ఏ పదవి శాశ్వతం కాదు. అయినప్పటికీ కూడా రాజకీయ నేతలు పదవుల కోసం ప్రాకులాడుతుంటారు. ఈ పదవుల కోసమే అప్పటివరకు సౌమ్యంగా ఉన్న నేతలు ఒక్కసారిగా తమ ఉగ్రరూపం చూపిస్తుంటారు. అలాగే అప్పటి వరకు పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నవారు ..పూర్తిగా సైలెంట్ అయి పోతారు. ఏదైనా కూడా పార్టీ లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికే. గత కొన్ని రోజులుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు వ్యవహార తీరు కూడా ఇదే విధంగా ఉంది. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతల తీరుపై ఒంటి కాలి తో లేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడడం మొదలు పెట్టారంటున్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా మంత్రి కావాలనే కోరికను మనసుల్లోనే పెట్టుకొని బయటకు గంభీరంగా కనిపిస్తుంటారు విద్యాసాగర్‌రావు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతిసారి ఆశ పెట్టుకోవడం ..ఆ తరువాత పదవి రాకపోతే మళ్లీ సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణం అయి పోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ , వివాదాలకు దూరంగా ఉండే ఆయన ఇప్పుడు విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలో దిశ ఘటనపై విద్యార్థుల తో ర్యాలీలు నిర్వహించి, ఏకంగా హక్కుల సంఘాలనే విమర్శించడం మొదలు పెట్టారు.

ఇక మీడియా సమావేశం నిర్వహించి పసుపు బోర్డు ఏర్పాటు పై మాట నిలుపుకోని బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గం లో ఉన్నా, లేనట్లు కనిపించే విద్యాసాగర్ రావు దూకుడు పెంచిన తర్వాత అభివృద్ధి పనులను సీరియస్‌ గా పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట. తన నియోజకవర్గం లో నిర్మాణమవుతున్న ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనుల వద్దకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తీసుకువెళ్లి ప్రాజెక్టు పని తీరును వివరించారు. అలాగే మంత్రి ఓ పని మీద వస్తే ఎమ్మెల్యే దగ్గరుండి మరీ రివర్స్ పంపింగ్‌ ను చూపించారట. నియోజక వర్గం లో ఉన్న సమస్యల పై ఫోకస్ చేస్తూ పబ్లిక్‌ కు మరింత టచ్‌లో ఉండడం తో ఎమ్మెల్యే లో ఇంత మార్పు ఏంటనేది కోరుట్ల లో చర్చనీయంశం గా మారింది. దీనికి ప్రధాన కారణం ఈసారైనా ముఖ్యమంత్రి తనని గుర్తించి మంత్రి పదవి ఇస్తారనే ఉద్దేశం తోనే నియోజకవర్గం లో దూకుడు పెంచారని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈసారైనా సీఎం కరుణిస్తాడో లేదో..


Tags:    
  • Korutla MLA upset over not getting cabinet berth 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS