నిన్న వారితో తిరిగి..నేడు చీప్ పాలిటిక్స్ అన్నారు
నిప్పు లేనిదే పొగ రాదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్సీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూసుకురాసుకు తిరిగితే ఎవరైనా ఏం అనుకుంటారు. అందులోకి.. ఈ ఇద్దరి మధ్య రకరకాల పంచాయితీలు ఉండటమే కాదు.. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగని పరిస్థితి. అలాంటి ఇద్దరు నేతలు రెండు రోజుల క్రితం ఒకే కారులో.. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తిరిగితే ఎవరైనా ఏమంటారు? సైకిల్ ఎక్కేందుకు రెఢీ అవుతున్నారనే అనుకుంటారు.
అలాంటి మాటే గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి విషయంలోనూ వచ్చింది. తన నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ (గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కోన రఘుపతిపై పోటీ చేసి ఓడారు)తో కలిసిన కోన రఘుపతి రెండు రోజుల క్రితం కారులో ప్రయాణించారు. ఇప్పటికే పలువురు జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ అయి.. సైకిల్ ఎక్కటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. కోన విషయంలోనే ఇలాంటి వార్తలే గుప్పుమన్నాయి.
గత రెండు రోజులుగా తన పార్టీ ఎమ్మెల్యేలతో పర్సనల్ గా మాట్లాడుతున్న జగన్.. ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోవద్దని చెప్పటమే కాదు.. భవిష్యత్తు దివ్యంగా ఉందని.. మంచి రోజులు ముందు ఉన్నాయని చెప్పటం.. తనకు విధేయత ప్రకటిస్తూ ప్రకటనలు చేయాలని కోరుతున్న పరిస్థితి. కారు ప్రయాణంతో పార్టీ జంపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కోన రఘుపతితో జగన్ అండ్ కో మాట్లాడటం.. జంపింగ్ ను ఖండించాలన్న ఒత్తిళ్ల మధ్య ఆయన తాజాగా నోరు విప్పారు.
తనకు ఆఫర్లు వస్తున్న మాట నిజమేనని చెప్పిన కోన రఘుపతి.. తాను అలా చీప్ పాలిటిక్స్ చేసే నేతను కాదని చెప్పుకొచ్చారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించానని.. తాను అలానే కొనసాగుతానని వ్యాఖ్యానించారు. నిన్నటికి నిన్న తమ్ముడితో కారులో తిరిగి.. ఇవాళ భలే మాట్లాడుతున్నారే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.