బీజేపీ రాజ్యసభ కోటాలో అనూహ్యమైన నేత ?
ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి కచ్చితంగా బీజేపీకి దక్కుతుంది అన్నది తెలిసిందే.;
ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి కచ్చితంగా బీజేపీకి దక్కుతుంది అన్నది తెలిసిందే. జూన్ లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండు జనసేనకు ఒకటి దక్కుతాయని కూడా చెప్పాలి. ఇక బీజేపీ కోటా కింద ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యేది ఎవరు అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నిన్నటి దాకా ఉన్న ప్రచారం ఒకటి లేటెస్ట్ గా చూస్తే కొట్టుకుని పోతోంది. ఆ ప్లేస్ లో ఒక స్ట్రాంగ్ పర్సన్ రంగంలోకి దిగుతున్నారని ఆయనకు హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు.
నత్వానీకి నో చాన్స్ :
ఇక 2020 జూన్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీకి దగ్గర మనిషి అని పేరున్న పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఎవరీయన అనుకుంటే బిగ్ షాట్ అని గుజరాత్ అని తేలింది. అంతే కాదు కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు అని కూడా ప్రచారం సాగింది. ఇక ఈ ఏడాది ఆయన కూడా తన పదవి నుంచి రిటైర్ కానున్నారు. అయితే ఆయనకే మరోసారి రెన్యూవల్ అని ఇప్పటిదాకా జరిగిన ప్రచారం అయితే ఇపుడు ఆయన స్థానంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు తెర మీదకు వస్తోంది.
బ్యాక్ గ్రౌండ్ గట్టిదే :
ఇక దాసరి శ్రీనివాసులుకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, అలాగే ఆయన పూర్వాశ్రమంలో ఏబీవీపీతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారని అంటున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి లోక్ సభకు బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాల్సి ఉంది. కానీ పొత్తులలో ఆ సీటు దక్కలేదని చెప్పుకున్నారు. ఇక ఆయన ఆధ్యాత్మిక సేవా తత్పరుడుగా పేరు గడించారు. గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు అని అంటున్నారు. సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు.
బీజేపీ ట్రంప్ కార్డు :
ఆయన ఉనంత విద్యావంతుడు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. దళిత నాయకుడు, దాంతో ఆయనకు టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపిస్తే ఏపీలో ప్రత్యేకించి రాయలసీమలో దళిత సామాజిక వర్గంలో కూడా బీజేపీ పలుకుబడి పెంచుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఏపీ నుంచి సీటు అంటే ఏపీ వారికే ఇవ్వాలన్న పార్టీ నేతల ఆలోచనను మన్నించినట్లుగా అవుతుందని అంటున్నారు. మొత్తానికి నూటికి తొంబై శాతం అవకాశాలు అయితే దాసరి శ్రీనివాసులుకే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.