బాలయ్య షో కోసం ఎక్స్ సీఎం, క్రికెటర్?

Update: 2022-11-14 01:30 GMT
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఫస్ట్ సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ అంతకుమించి అనేలా రెస్పాన్స్ అందుకుంటుంది. నిర్వాహకులు ఇతర రంగాలలోని గెస్ట్ లను కూడా రప్పిస్తున్నారు. మొదట కేవలం సినీ ప్రముఖులతో మొదలైన ఈ ఎంటర్టైన్మెంట్ షో ఆ తర్వాత రాజకీయ నాయకులతో సరికొత్త మలుపు తిరగబోతున్నట్లు అర్థమవుతుంది.

ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా అతిథులుగా వచ్చి షో స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లారు. అయితే ఇప్పుడు గెస్ట్ లు దొరకడం కాస్త కష్టంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. రావాల్సిన వారు ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండడం వలన రాలేకపోతున్నారు. దీంతో విభిన్నమైన రంగాల నుంచి ప్రత్యేకమైన గెస్ట్ లను రంగంలోకి దింపాలని ఆలోచనలో ఉన్నారు.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ షోలోకి ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తో బాలయ్యకు మంచి అనుబంధ ఉంది. వీరిద్దరూ క్లాస్మెంట్స్ కూడా. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా షోలో కనిపిస్తే మాత్రం కొంత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.

 అలాగే మరొకవైపు మాజీ ఇంటర్నేషనల్ క్రికెట్ అజారుద్దీన్ ని కూడా ప్రత్యేక అతిథి గా పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ బోర్డులో అధ్యక్షుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ గతంలో కాంట్రవర్సీ మధ్యలోనే అతని కెరీర్ కొనసాగింది. పలు ఫిక్సింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పటికి కూడా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇద్దరినీ ఒకేసారి షోలోకి పిలవాలని ఆలోచనలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా దేశవాళి క్రికెట్ టోర్నీలలో ఆడిన అనుభవం ఉంది. అందుకే వీరిద్దరినీ ఒకేసారి షోలుకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ప్రణాళిక కూడా రెడీ కానుంది.
Tags:    

Similar News