సీఎంకి షాక్ ఇచ్చిన కిరణ్ ..ఏమైందంటే !
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరోసారి తన నిర్ణయానికి తిరుగులేదు అని నిరూపించుకుంది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ కి , లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కి మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకోని అమలుచేయాలని చూస్తున్న పలు పథకాలకు అడ్డుతగులుతూ నారాయణ స్వామి సర్కార్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా,దాన్ని కూడా అడ్డుకున్నారు. ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి కోర్టులో ఫీల్ వేశారు.
ఇక ఇదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం పైన కూడా కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, ప్రభుత్వ నిర్ణయానికి చెక్ పెట్టేశారు. ఈ నేపథ్యంలో నారాయణ స్వామి సర్కార్ కి ..మరో ఎదురుదెబ్బ తగిలింది. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో జరిగిన హైడ్రామా కి కోర్టుకి ముగింపు పలికింది. ఈ విషయంలో కిరణ్ బేడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే , ఇప్పటికే కిరణ్ బేడీ చేతిలో పలుసార్లు ఓడిపోయిన నారాయణ స్వామి సర్కార్ కి ..ఇది మరో భారీ భంగపాటు అని చెప్పవచ్చు.
అసలు ఏంజరిగిందంటే ... పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్ ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ కొన్నిరోజుల ముందు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే , కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించి ,కిరణ్ సర్కార్ నిర్ణయాన్ని తీసిపడేసారు. అయితే , అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వు జారీ చేశారు. దీనితో ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు కు చేరింది. సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులని రద్దు చేసి, కిరణ్ బేడీ కొత్త ఉత్తర్వులను జారీచేసింది అని , ఆ ఉత్తర్వులని రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. ఈ వ్యవహారం పై గత కొన్ని నెలలుగా కోర్టు లో విచారణ జరుగుతుండగా ..తాజాగా గురువారం ఈ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్ధించారు.