చైనా లక్ష్యంగా క్వాడ్ దేశాల కీలక ప్రకటన!
జపాన్‌లోని టోక్యో వేదికగా జరిగిన క్వాడ్ సమావేశంలో అమెరికా,భారత్,ఆస్ట్రేలియా,జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. గతేడాది మొదటిసారిగా న్యూయార్క్ లో క్వాడ్ సమావేశం జరిగింది. ప్రస్తుతం భారత్ ,చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది క్వాడ్ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ఇండో, పసిఫిక్ సముద్ర జలాలపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఫ్రీ నేవిగేషన్ అవసరంపై నాలుగు దేశాలు చర్చలు జరిపాయి. ఈ క్వాడ్ సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశకంర్,అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటేగి, ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్ మారిస్ పైన్ క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడుతూ... పరస్పర భాగస్వామ్య విలువలతో శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండో-పసిఫిక్ సముద్ర జలాలపై సమిష్టిగా స్వేచ్చ ప్రాధాన్యతపై మనమంతా దృష్టి సారించాం. చట్ట నియమాలు, పారదర్శకత, మహా సముద్రాలలో నావిగేషన్ స్వేచ్ఛ, ప్రాదేశిక సమగ్రత,సార్వభౌమత్వాన్ని గౌరవించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం వంటి అంశాల సమర్థనకు కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్ రీజియన్ లో చట్టబద్ధమైన, కీలకమైన ప్రయోజనాలను కలిగి ఉన్న అన్ని దేశాల భద్రత - ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధే మన లక్ష్యం. దీనిపై మన వాదనలకు విస్తృత ఆమోదం పొందడం సంతృప్తికరమైన విషయం అని తెలిపారు.
సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఒక్కరే చైనా పేరు ప్రస్తావించడం గమనార్హం. 'క్వాడ్ భాగస్వామ్యులుగా గతం కంటే ఇప్పుడు మన ప్రజలను,భాగస్వామ్య దేశాలను చైనా దోపిడీ,అవినీతి,దూకుడు నుంచి కాపాడుకోవడం మరింత క్లిష్టంగా మారిందన్నారు. అటు తూర్పు - దక్షిణ చైనా సముద్రంపై - ఇటు తైవాన్ జలసంధిపై ఆక్రమణకు ప్లాన్ వేసిన చైనా మరో పక్క భారత్ తో సరిహద్దులో ఉద్రిక్తతలకు తెరదీస్తోంది...అని అన్నారు. ఇండో - ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం సాధించే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలను సమిష్టిగా తిప్పికొట్టడంతో పాటు అక్కడ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కృష్టి చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు.
చైనా నుంచి కరోనా వైరస్ పుట్టుకొస్తుందని మనమెవరం ఊహించలేదన్న పాంపియో - చైనా నిజాలను దాచిపెట్టడం వల్లే ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. మొత్తం మీద చైనా ఆట కట్టించేందుకు ఈ నాలుగు దేశాలు సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగనున్నాయి. సరిహద్దులో భారత్ ను కవ్వించడం - ఇండో పసిఫిక్ - దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టడం పైనే ఈ దేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. అలాగే నాలుగు దేశాలు సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే తాజా సమావేశంలో మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.