• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ ది...

ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ ది మాస్టర్ స్ట్రోక్!

By - Tupaki Desk
Update: 2020-06-20 05:30 GMT
కలలు కనటం అందరూ చేసేదే. కానీ.. కన్నకలల్ని సొంతం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు. ప్రజాస్వామ్య భారతంలో ఉద్యమ నాయకుడి వ్యవహరిస్తూ రాజకీయ పార్టీని నడపటం అంటే తమాషా కాదు. నిప్పుల మీద నడకను నిబ్బరంగా.. నిబద్ధతతో నడిపిన కేసీఆర్ తాను అనుకున్నట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే కాదు.. అధికారాన్ని సొంతం చేసుకున్నారు.

తనను తాను గొప్పగా చెప్పుకునే అలవాటు కేసీఆర్ లో కనిపిస్తుంటుంది. కేసీఆర్ తోనే ఆటలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆయన ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందే కానీ అతిశయంగా అనిపించదు. కేసీఆర్ తో పెట్టుకుంటే తగిన ఫలితం చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చినప్పుడు.. బడాయి మాటలు భలే చెబుతారన్న స్థానే.. భయం కలిగించేలా మాటలు ఉండటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం.

మిగిలిన వారికి కేసీఆర్ కు తేడా ఏమిటంటే.. అవకాశం లభించాలే కానీ.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా  నిర్ణయాలు తీసుకోవటం. ఎవరేమైనా అనుకుంటారన్న జంకు ఆయనలో అస్సలు ఉండదు. తాను ప్రకటించే నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం.. ఒకసారి డిసైడ్ అయితే ముందుకే తప్పించి వెనకడుగు వేయని లక్షణంలో ఆయనలోకనిపిస్తుంది. నిజానికి అదే ఆయనకు తిరుగులేని అధినేతగా మార్చిందని చెప్పాలి.

చైనా దురాగతంతో ప్రాణాలు విడిచిన ఇరవై మంది సైనికుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చూస్తే.. ప్రధాని హోదాలో ఉండి మోడీ చేయలేనిది ఏమిటో అర్థమయ్యేలా చేస్తుంది. దేశం కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ తో పాటు ఇరవై మంది త్యాగాలకు దేశం కన్నీరు పెట్టింది. వారి కుటుంబాలను గుర్తుకు తెచ్చుకొని వేదన చెందినోళ్లు కోట్లాది మంది ఉన్నారు. ఇలాంటివేళ.. ఈ కుటుంబాలకు సంబంధించిన ప్రధాని మోడీ నుంచి  ఏదైనా కీలక ప్రకటన వెలువడుతుందని వెయిట్ చేసినోళ్లు లేకపోలేదు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

అందుకు భిన్నంగా ఎవరి అంచనాలకు చిక్కకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన చాలామందిని విస్తుపోయేలా చేసింది. అఖిలపక్షంతో ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రాణత్యాగం చేసిన సైనికుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల నగదు.. ఇంటి స్థలంతో పాటు ఆయన భార్యకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించి చాలామంది ఆశ్చర్యపోయేలా చేశారు.

ఇలాంటి సమయాల్లో అందరి కంటే ముందు కేసీఆర్ స్పందిస్తారని తెలుసు కానీ.. మరీ ఇంతలా అన్నది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇక్కడితో ఆగని కేసీఆర్.. వీర మరణం పొందిన మిగిలిన సైనికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.10లక్షలుచొప్పున అందజేస్తామన్నారు. ఇంతా చేసిన తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే మొత్తాన్ని కేంద్రమంత్రి ద్వారా అందిస్తామని చెప్పటం ద్వారా.. ఎవరూ నొచ్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇదంతా చూసినప్పుడు.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రకటన.. ప్రధాని మోడీ నుంచి రావాలన్న భావన దేశ ప్రజల్లో కలిగేలా చేయటమే కేసీఆర్ మార్క్ అని చెప్పక తప్పదు. 
Tags:    
  • KCR 
  • New Plan 
  • GHMC 
  • Telangana 
  • Trs 
  • Political News 
  • Breaking News 
  • Tupaki News Tupaki Updates 
  • Tupaki 
  • Latest News 
  • Tupaki Media 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS