భారీ రిస్కు తీసుకుంటున్న కేసీఆర్?
కరోనా వేళ.. లాక్ డౌన్ సమయాన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. ఇప్పటికే అలాంటి కేర్ తీసుకుంటున్నోళ్లు లక్షలాది మంది ఉన్నారు. నెలలకు నెలలు గడుస్తున్నా.. చాలా అవసరాల్ని.. ఇష్టాల్ని పక్కన పెట్టేసి కరోనా కోరలకు చిక్కకుండా ఉండేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే కేసుల దూకుడు తీవ్రంగా ఉన్న వేళ.. ఏ విషయంలోనూ తొందరపాటు పనికి రాదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం పలువురికి విస్మయానికి గురి చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తాజాగా జరుగుతున్నాయి. ముందుగా అనుకున్నట్లే.. సమావేశాల్ని ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంత తేలికైన విషయం కాదు.
అందుకు భారీ ఎత్తున కసరత్తు చేపట్టటమే కాదు.. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందితో పాటు.. అధికారులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వేళలో.. ఫాస్ట్ ట్రాక్ లో సమావేశాల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా.. రెండో శనివారం..ఆదివారాలు మినహా ఏకంగా 18 రోజుల పాటు సమావేశాల్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. ప్రతి రోజు ఉదయం పది గంటలకు సమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు.
బిల్లులు ప్రవేశ పెట్టే రోజుల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరుగంటల వరకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభ ప్రారంభం కాగానే గంట ప్రశ్నోత్తరాలు.. మరో అరగంట జీరో అవర్ నిర్వహించనున్నారు. టీ విరామం తర్వాత లఘు చర్చను చేపడతారు. ఈ సమావేశాల్లో భాగంగా ప్రవేశ పెట్టాలని భావిస్తున్న బిల్లులకు సంబంధించి రెండు.. మూడు రోజులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అసెంబ్లీ మాదిరే శాసన మండలిని సైతం 18 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సమావేశాల్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం.
నిజమే.. సమావేశాలు నిర్వహించటం తప్పేం కాదు. నిజానికి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే అంత ఉపయుక్తంగా ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అన్నేసి రోజులు సమావేశాల్ని నిర్వహించటం క్షేమకరం కాదన్న వాదన వినిపిస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా.. చాలామంది ఆరోగ్యాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున.. ఇంత దీర్ఘకాలం సమావేశాన్ని నిర్వహించటం చూస్తే.. కేసీఆర్ రిస్కు తీసుకుంటున్నారనే చెప్పాలి. ఇప్పుడున్న వేళలో.. ఇంత రిస్కు అవసరమంటారా సారూ?