కేసీఆర్ మాట్లాడుతుంటే ఆ చప్పట్లేవి?

Update: 2016-04-14 09:16 GMT
భారీ కార్యక్రమాల్ని తరచూ ప్రకటించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని స్టార్ట్ చేసే విషయంలో మాత్రం ఆలస్యం చేస్తుంటారు. ఈ తరహాకు భిన్నంగా 125 అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా శంకుస్థాపన చేపడతామని చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఓవైపు ఎండ మండిపోతుంటే.. మరోవైపు బహిరంగ సభను పెట్టి ప్రసంగించటం మొదలెట్టారు.

సాధారణంగా కేసీఆర్ లాంటి నేత మాట్లాడుంటే వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మండే ఎండతో ఉత్సాహం ఆవిరి అయిపోయిందో ఏమో కానీ.. సభికులు స్తబ్దుగా ఉన్నారు. వారిని ఉత్సాహపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నించినా.. సభికుల నుంచి స్పందన పెద్దగా రాలేదు. అంబేడ్కర్ ఎంత గొప్ప వ్యక్తో తెలుసా అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా సభికుల నుంచి స్పందన అంతంతే ఉంది. దీంతో కేసీఆర్ కల్పించుకొని గొప్పవాళ్ల గురించి స్మరించుకునేటప్పుడు చప్పట్లు కొట్టాలని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

అయినప్పటికి పెద్దగా స్పందన లేదు. దీంతో మరోసారి రియాక్ట్ అయిన కేసీఆర్ ‘‘చప్పట్లు కొడితే ఎట్లుండాలె. చప్పుట్లు కొడితే టెంట్ లేచిపోవాలె’’ అని ఉత్సాహపర్చటంతో చప్పట్ల మోతలో కాస్త తేడా వచ్చింది. మండే ఎండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ నోట వచ్చిన మాట చిన్నబోయిందని చెప్పాలి.   
Tags:    

Similar News