ముంబయిలో బాబును గుర్తు చేసుకున్న కేసీఆర్
పైకి ఎవరెన్ని మాటలు అన్నా.. ఒకనాటి గురుశిష్యుల మధ్య బంధం కాస్త బలమైందిగానే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రుళ్ల మధ్య కొన్ని విషయాల్లో ఒకరిపైన ఒకరికి చాలానే గురి ఉన్నట్లు కనిపిస్తుంది. విభజన జరిగిన కొత్తల్లో ఇద్దరు చంద్రుళ్లు కలిసిన సందర్భంలో ఏపీ రాజధానిగా ఇప్పటి అమరావతి ప్రాంతం బాగుంటుందని..వాస్తు పరంగా సూట్ అవుతుందన్న సలహాను కేసీఆర్ ఇవ్వటం.. దానికి తగ్గట్లే చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం కనిపిస్తుంది. అదే తీరులో.. సముద్రంలోకి పోయే జలాల్ని వృధా కాకుండా జాగ్రత్తగా వినియోగించుకునేలా నిర్ణయం తీసుకోవాలంటూ తరచూ చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బాగానే పని చేసినట్లు కనిపిస్తోంది.
దాదాపు 400 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రాంతంతో ఉన్న జలవివాదానికి చెక్ చెబుతూ.. చారిత్రక నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ.. మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రావటం.. ఈ రోజు ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం గోదావరి.. ప్రాణహిత.. పెన్ గంగ నదులపై నిర్మించే ఐదు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో.. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని తెలంగాణకు మళ్లించుకోవటమే కాదు.. సాగు.. తాగునీటికి ఉపయోగించుకునే వీలు ఉంటుంది.
తాజా ఒప్పందం కుదుర్చుకునే సందర్భంలో మాట్లాడిన కేసీఆర్.. తన మాటల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకురావటం గమనార్హం. సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతుంటారని ఆయన్ను గుర్తు చేసుకోవటం గమనార్హం. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా.. ఎదుటి మనిషిలోని మంచిని గ్రహించటం.. దాన్ని సందర్భానికి తగ్గట్లుగా ప్రస్తావించటం కేసీఆర్ కే సాధ్యమని చెప్పక తప్పదు.