కేసీఆరా మజాకానా.. దశాబ్ది ఉత్సవాల వేళ 12 పేజీల పండుగ

Update: 2023-06-02 11:03 GMT
ఏం చేసినా అదిరేలా చేయాలన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. ఆయన అభిమానం అయినా.. ఆగ్రహం అయినా ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల ముందుకు వచ్చేసిన వేళ.. ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్ని భారీ ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల్ని ఒకరోజు రెండు రోజులు కాకుండా ఏకంగా 21 రోజులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేయటం తెలిసిందే.

ఇందుకు తగ్గట్లే భారీ ప్లాన్ ను  సిద్ధం చేసిన ఆయన.. తాను రూపొందించిన క్యాలెండర్ ప్రకారం ఉత్సవాల్ని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయించారు. అందరికి అన్నిచేస్తున్నప్పుడు.. తాను ఇష్టపడే మీడియా సంస్థల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా? జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ విజయగాథను ఇతర రాష్ట్రాల్లోని మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలకు ఆయన భారీగా ఇచ్చిన ప్రకటనల పరంపర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ప్రభుత్వ ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వటం మామూలే. దశాబ్ది ఉత్సవాల వేళ.. కేసీఆర్ సర్కారు మరింత జోరును ప్రదర్శించింది. కొన్ని మీడియా సంస్థలకు.. దినపత్రికలకు ఏకంగా 12 పేజీలతో కూడిన జాకెట్ యాడ్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది.

ఇప్పటివరకు ఇంత భారీ ప్రకటనల్ని ఏ మీడియా సంస్థకు మరే ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతున్నారు. అన్ని మీడియా సంస్థలకు కాకుండా కొన్ని సంస్థలకు ఇచ్చిన వైనం చూస్తే.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్ని మీడియాసంస్థలకు ఇదో ఫెస్టివల్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. కేసీఆరా మజాకానా

Similar News