కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న వైఎస్ జగన్!

Update: 2019-06-14 04:43 GMT
ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో తమ అజెండా ఏమిటో మరో సారి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎంకరేజ్ చేసే ఉద్దేశమే లేదని జగన్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నుంచి తమ పార్టీలోకి రావాలనుకుంటే వారు పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కొందరు ఎమ్మెల్యేలు రెడీగానే ఉన్నా - తాము వారిని ఎంకరేజ్ చేయ దలుచుకోలేదని..ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వస్తేనే  తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.

ఒక పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చలామణి కావడం ఏపీ అసెంబ్లీలో ఉండదని - ఈ విషయంలో తమ అసెంబ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుందని జగన్ ప్రకటించారు.

మరి ఇలా విలువలకు కట్టుబడి ఉంటామని జగన్ ప్రకటించడం మిగతా రాష్ట్రాలకు ఏమో కానీ తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ఇబ్బందికరంగా మారనుంది. అక్కడ అంతా ఫిరాయింపు రాజకీయమే నడుస్తోంది. ఫిరాయింపు
ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని సీఎల్పీని విలీనం చేసుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ మాత్రం అలాంటివి ఉండవని - అలా చేస్తూ తనకూ చంద్రబాబుకు తేడా ఉండదని వ్యాఖ్యానించారు. జగన్ దెప్పి పొడుపులు చంద్రబాబును ఉద్దేశించినవే అయినా, అవి ఎంతో కొంత చంద్రశేఖరరావును కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నాయి!
Tags:    

Similar News