• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాస్ట్ పంచ్ కేసీఆర్..బాబు...

లాస్ట్ పంచ్ కేసీఆర్..బాబు గుబులు

By - Tupaki Desk
Update: 2019-04-09 04:38 GMT
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్టుగా కేసీఆర్ చివరి పంచ్ విసిరాడు.. బాబు బ్యాచ్ ను అతలాకుతలం చేసేశాడు. మరి ఎన్నికలకు ఇంకో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. ప్రచారానికి నేటి సాయంత్రంతో గడువు ముగిసిపోవడంతో కేసీఆర్ కౌంటర్ జనంలోకి వెళ్లిపోయింది. దీనికి ఎన్ కౌంటర్ ఇద్దామని బాబు ఎంత ప్రయత్నించినా అది సఫలం కాదు.. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకే బాబు బ్యాచ్ ప్రచారం చేయగలదు.. దీన్ని జనంలో వ్యతిరేకించగలదు.  కాబట్టి టైం చూసి కేసీఆర్ విసిరిన ఈ బ్రాహ్మస్త్రానికి బాబు బ్యాచ్ ఆందోళన చెందుతోంది.

నిన్న వికారాబాద్ సభలో కేసీఆర్ అదును చూసి టీడీపీపై దాడి చేశాడు. చంద్రబాబు తనను తిడుతున్నాడని.. తాము ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతునిస్తున్నామని.. పోలవరంకు కూడా అడ్డుకాదని విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో టీడీపీ ఆరోపణలు వట్టి నీటి మూటలని తేలిపోయింది.కేసీఆర్ ప్రకటన ప్రతిపక్ష వైసీపీ వాదానికి బలం చేకూరుస్తూ వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టైంది. వైసీపీ - టీఆర్ ఎస్ ఎంపీలు కలిసి ఢిల్లీలో పార్లమెంట్ లో ఏపీకి హోదా సాధిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు రాత్రి దీన్ని ఖండించాడు. ఇన్నాళ్లు హోదాకు కేసీఆర్ మద్దతివ్వడం లేదని.. పోలవరం అడ్డుకుంటాడని చెప్పిన బాబు సడన్ గా ఇప్పుడు వీటిని అంగీకరించిన కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయి అని నాలుక మడతేశాడు. కేసీఆర్ ప్రకటన ఏపీలో వైసీపీకి కొండంత బలంగా మారడంతో టీడీపీ గగ్గోలు పెడుతోంది.

తాజాగా మంగళవారం ఉదయం మంత్రి దేవినేని ఉమ రంగంలోకి దిగి పోలవరం - హోదాపై కేసీఆర్ మద్దతుపై విరుచుకుపడ్డారు.  మోడీ - కేసీఆర్ - జగన్ లు ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆడిపోసుకున్నారు..

ఇలా కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసిన ప్రకటన ఏపీ పోలింగ్ కు రెండు రోజుల ముందు వైసీపీకి బాగా ప్లస్ అవుతుండగా.. టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరి కేసీఆర్ విసిరిన లాస్ట్ పంచ్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి మరి..
Tags:    
  • KCR 
  • Chandrababu naidu 
  • Andhra Special Status 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS