• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీయార్... జగన్ ఒకేసారి...

కేసీయార్... జగన్ ఒకేసారి బటన్ నొక్కేస్తారా...?

By - Tupaki Desk
Update: 2023-01-17 01:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రకాల రాజకీయాలు. కానీ ఇపుడు ఒకే రూట్ లో సాగుతాయని అంతా అంటున్నారు. దానికి కారణం ఇద్దరి ఆలోచనలు ఒక్కటే కావడం అంటున్నారు. నాలుగేళ్ల పాలన చాలు అయిదేళ్ళూ వద్దు అని కేసీయార్ జగన్ అనుకుంటున్నారుట. పూర్తి కాలం అధికారంలో ఉంటే తమకు ఇబ్బందులు అని తలపోస్తున్నారుట. అందుకే ముందస్తు మంత్రం జపిస్తున్నారుట.

ఏపీలో జగన్ ముందస్తుకు వెళ్తారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా చెప్పుకుంటే ఆర్ధిక వ్యవస్థ. ఏపీ అప్పులతో లేచి అప్పులతో రోజు ముగిస్తోంది. ఖజానా ఖాళీ అయింది. హామీలే తప్ప ఆచరణకు నిధులు లేవు. దాంతో ఎన్నికలకు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కనీసం పధకాలు పూర్తి చేశామని చెప్పుకోవచ్చు అని భావిస్తున్నారు అంటున్నారు.

మరో వైపు వివిధ వర్గాలలో పెరిగిపోతున్న అసంతృప్తిని అలాగే ఉంచుతూ ఎన్నికలకు వెళ్తే ఎంతో కొంత నష్టంతో బయటపడవచ్చునని ఆలోచిస్తున్నారుట. ఇక రాజకీయంగా చూస్తే విపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదు అన్నది ఒక పంతం. లోకేష్ కి టైం ఇస్తే ఆయన నాలుగు వందల రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి జగన్ రికార్డుని బద్ధలు కొడతారు. అంతే కాదు ఏపీలో వైసీపీ వ్యతిరేక వాతావరణాన్ని కూడా ఆయన రెడీ చేసి పెడతారు అని ఆలోచిస్తున్నారు. దాంతో పాదయాత్ర మొదలెట్టి కొంత నడిచాక ఆపేసేలా ఎన్నికలను ముందస్తుగా ప్రకటిస్తారు  అని అంటున్నారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం కూడా ఏపీలో కలియతిరగకుండా ఉంచాలంటే ముందస్తు ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నారుట. ఇక విపక్షాల మధ్య పొత్తులు సీట్ల పంపకాలు ఒక కొలిక్కి రాలేదు. అందువల్ల ముందస్తు ఎన్నికలు అంటూ వెళ్తే విపక్షాలు ఏకత్రాటి మీదకు వచ్చినా గ్రౌండ్ లెవెల్ లో బలపడకుండా ఎన్నికలకు పోవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

వీటికి మించి అతి కీలకమైన పాయింట్ ని రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు వెల్లడించారు. అదేంటి అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం పూర్తిగా తేలకముందే ఎన్నికలకు వెళ్తే ఆనక ఏమి జరిగినా కూడా కాసుకోవచ్చు అన్న కీలకమైన అజెండా ఉంది అంటున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో పలువురి వైసీపీ నేతలు పేర్లు వినిపిస్తూండడంతో ఈ విధంగా  ముందస్తుకు తొందర పడుతున్నారని అంటున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో నిర్వహించి అవి ముగిసిన తరువాత అసెంబ్లీ రద్దు చేస్తూ జగన్ బటన్ నొక్కుతారని రెబెల్ ఎంపీ జోస్యం చెబుతున్నారు. ఊహాగానాలు కూడా అలాగే ఉన్నాయి. రాజకీయ ప్రచారం కూడా అదే స్థాయిలో ఉంది. ఇక తెలంగాణా సీఎం విషయానికి వస్తే కేసీయార్ సైతం ముందస్తుకు వెళ్తారని అంటున్నారు. ఫిబ్రవరి 17న ఆయన పుట్టిన రోజు వేళ కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు అని అంటున్నారు.

ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలోనే నిర్వహించి అదే నెలలో అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీయార్ కూడా బటన్ నొక్కేస్తారుట. మొత్తానికి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే సమయంలో ఎన్నికలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ వాస్తవం ఉందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Telangana 
  • cm 
  • KCR 
  • ap 
  • cm 
  • ysjagan 
  • latestnews 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

Copyright @2026

Powered by Blink CMS