కన్నాకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిపోయిన కాంగ్రెస్ నేతల్లో గుంటూరుకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. కాసింత ఎటకారంగా.. మరికాస్త పొడిచినట్లుగా మాట్లాడే కన్నా గాలి ఒక రేంజ్లో సాగింది. దివంగత మహానేత వైఎస్ హయాంలో కన్నా కీలక బాధ్యతలు చేప్టటారు.
మంత్రిగా పదవులు చేపట్టటంతోపాటు.. క్రియాశీలకరాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వంపై పోరాడకుండా కామ్ గా ఉన్న ఆయన.. తర్వాతికాలంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు. ఎంత సర్దుకున్నా.. బీజేపీలో ఆయన ఇమడకపోవటం.. కమలం పార్టీలో తనకు పొలిటికల్ ఫ్యూచర్ లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న కన్నా.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కన్నా.. వైఎస్ జగన్ కానీ ఓకే అంటే తాను.. తన కార్యకర్తలతో కలిసి పార్టీలో చేరేందుకు రెఢీ అన్న సంకేతాన్ని ఇప్పటికే పంపారు.అయితే.. పార్టీలో కాంగ్రెస్ మాజీలను చేర్చుకునే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్న జగన్..కన్నాకు ఇంకా ఓకే చెప్పలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కన్నా ఈ తెల్లవారుజామున (బుధవారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఉన్నట్లుండి ఆయనకు హై బీపీ రావటంతో.. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేసిన తర్వాతి రోజునే కన్నా తీవ్ర అస్వస్థతకు గురి కావటం గమనార్హం.