దశావతారం రోల్ నే సినిమా చేసేసిన కమల్..

Update: 2016-04-29 09:28 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పుడు తన కొత్త మూవీని స్టార్ట్ చేసేశాడు. హిందీ - తెలుగు - తమిళ్ లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై.. అన్ని ఇండస్ట్రీలలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను కమల్ హాసన్ స్వయంగా అనౌన్స్ చేశాడు. కమల్ చెప్పిన డీటైల్స్ ప్రకారం తెలుగులో ఈ సినిమా పేరు 'శభాష్ నాయుడు.' ఇందులో కమల్ పాత్ర పేరు బల్ రామ్ నాయుడు. నేర పరిశోధక సంస్థ రా ఆఫీసర్ గా  ఇందులో కమల్ కనిపిస్తున్నారు.

నిజానికి ఈ పాత్ర.. కమల్ హాసన్ గతంలో చేసిన దశావతారంలో ఉంటుంది. అందులో కమల్ చేసిన పది పాత్రల్లో ఈ బల్ రామ్ నాయుడు కూడా ఒకటి. ఇప్పుడదే పాత్రను పూర్తి సినిమాగా చేశారు కమల్. కేరక్టర్ ను దశావతారం నుంచి తీసుకున్నా.. స్టోరీ అంతా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. స్టోరీ ప్రకారమే ఈ శభాష్ నాయుడు.. ఓ ఫ్యామిలీ మూవీ అంటున్నారు. తన భార్య, కూతురుతో ఉండే అనుబంధం బేస్డ్ గా ఉంటుందట. అందుకే ఈ మూవీలో తన భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకున్నామని కమల్ హాసన్  చెబుతున్నారు.

అలాగే కమల్ కి స్వయానా కూతురైన శృతి హాసన్.. శభాష్ నాయుడులో కూతురి పాత్రను పోషిస్తుండడం విశేషం. 11 ఏళ్ల తర్వాత ఇళయరాజాతో కలిసి కమల్ హాసన్ చేస్తున్న మూవీ కావడంతో... ఇప్పటికే ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు ఏర్పాడ్డాయి. శభాష్ నాయుడును దీపావళి నాటికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News