వాళ్లకు కూడా టార్గెట్ అయిన గవర్నర్

Update: 2015-06-11 09:32 GMT

ఓటుకు నోటు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్న ఈ అంశం కాస్త ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీకి చేరింది. అయితే 

తాజా ఎపిసోడ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్ వల్ల కావడం గమనార్హం. తెలంగాణలో ఇంతలా వ్యవహారం ముదరడానికి కారణం గవర్నరే కారణం అని  తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. 

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ నరసింహన్‌‌...ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ గా నరసింహన్‌ వైఫల్యం చెందారని అందుకే స్వయంగా కల్పించుకోవాలంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ తో తప్ప ఇతర పార్టీలతో గవర్నర్‌ ముందు నుంచీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించారని, ఫిరాయింపులపై గవర్నర్ సకాలంలో స్పందించలేదని ఆయన అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రిగా ప్రమాణం చేయించి గవర్నర్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. రాజకీయ ఫిరాయింపుల వికృత క్రీడను గవర్నర్ సమర్ధిస్తున్నారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో టిఆర్ఎస్ బలపడడానికి గవర్నర్ నరసింహన్ పావుగా మారారని ఆరోపించారు. అన్నివిషయాలను కులంకషంగా వివరిస్తూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News