పవన్ పిలిస్తే వెళతా.. వైసీపీ నుంచి ఆఫర్ ఉంది: జేడీ లక్ష్మీనారాయణ

Update: 2021-11-29 06:37 GMT
సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా చేసిన లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన జగన్ అక్రమాస్తుల కేసు విచారణ చేసి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అయితే వైసీపీ గాలిలో జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. అప్పటి నుంచి ఈయన మీడియాలో ఎక్కువగా కనిపించలేదు. కానీ ఇటీవల ఓ మీడియాలో కనిపించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఏదో చేద్దామని ఉందని తెలిపారు. అందుకు మళ్లీ రాజకీయాల్లో వెళ్లడానికి రెడీగా ఉన్నానని అన్నారు. అయితే వైసీపీ నుంచి ఆఫర్ ఉంది.. జనసేన పిలుస్తోంది. అని తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ మనసులో ఏముందంటే..?

యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ పలు ఆసక్తి విషయాలను వెల్లడించారు. ‘అక్రమాస్తుల కేసులో జగన్ ను విచారించిన ఆయన ఆ తరువాత కొంతకాలం కొత్తపార్టీ పెడుతారన్న ప్రచారం జరిగింది. అయితే ‘జనధ్వని’ అనే పార్టీకోసం రిజిస్టర్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ అది వేరే వాళ్ల పార్టీ అని, దానిని నాకిస్తారరని చెప్పారు. కానీ సొంతంగా ఏ పార్టీకి రిజిస్టర్ చేయలేదు. అలాగే లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ కూడా ఆ పార్టీని నడిపించాల్సిందిగా కోరారు’ తెలిపారు.

అయితే ఓ వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు నాయకులు జేడీని కలిశారు. తమ పార్టీలోకి రావాలని కోరారు. కానీ జేడీ మాత్రం తాను రాలేనని చెప్పారని అన్నారు. అయితే తాను జగన్ కేసును అంత సీరియస్ గా తీసుకున్నా ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారని, అలాంటప్పుడు ఆయన పార్టీలో చేరొచ్చుగా అన్న ప్రశ్నకు .. ‘ఒక వ్యక్తి మీద కేసులు వేరు.. ఆయన చెప్పిన విధానం వేరు. ఆయన చెప్పిన కొన్ని విధానాలతో ప్రజలు ఆదరించారు. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు’ అని చెప్పారు.

ఇక జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ బయటకు వచ్చారు. ఈ తెగదెందపులు ఇలాగే ఉంటాయా..? మళ్లీ చేరుతారా..? అని అడగగా ‘డెఫినెట్లీగా చర్చలు జరుపుతా. మళ్లీ వారు పిలిస్తే వెళుతాను. జనసేన పార్టీ విధానాలు నచ్చడం వల్లే అందులో చేరారు. అయితే కొంతకాలం దూరంగా ఉన్నా మళ్లీ చేరే అవకాశం ఉంటుంది. అయితే ఏ సమయం అనేది చెప్పలేను’ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.




Tags:    

Similar News