విజయనగరంలో జనసేనాని టూర్.. పార్టీ బలపడుతుందా...?
విజయనగరం జిల్లాలో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి సమస్యలపై గళం వినిపించనున్నారు. అయితే, దీనివల్ల పార్టీకి మేలు జరుగుతుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనసేనాని పర్యటించారు. అక్కడి సమస్యలపైకూడా ప్రశ్నించారు. అయితే, పార్టీపరంగా చూసుకుంటే పుంజుకున్న పరిస్థితి లేదు.
కానీ, ఎన్నికల్లో మాత్రం ఆయన విజయం దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఏ పార్టీ అయినా విజయం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఆ పార్టీకి కేడర్ ఉండాలనేది తెలిసిన విషయమే. గత ఎన్నికలను చూసుకుంటే.. జనసేన తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన యువనాయకులు.. ఇప్పుడు పెద్దగా యాక్టివ్ గా లేరు. పైగా ఇక్కడ టీడీపీబలంగా ఉంది. ఇక, వైసీపీలో కీలకనాయకులు చాలా మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో జనసేన ఇక్కడ పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు చాలాచాలా తక్కువగానే కనిపిస్తు న్నాయి. ఇప్పటి నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తే తప్ప పవన్ పార్టీ పుంజుకునేది లేదని స్పష్టంగా తెలు స్తోంది. అయినప్పటికీ పవన్ ఆదిశగా అడుగులు వేయలేక పోతున్నారు. ఉదాహరణకు అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కాకుండా ఉన్న ఆయకులు చాలా మంది ఉన్నారు. వీరిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయలేక పోతున్నారనే వాదన ఉంది.
నిజానికి అసలు ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని, తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ చెబుతున్నా.. పార్టీ పరంగా ఆయన ఎలాంటి వ్యూహాలూ సిద్ధం చేసుకోకుండా.. రోజుకో సమస్యను భుజాలపై వేసుకుం టున్నారు.
దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఆసక్తిగానే మారింది. దీనిపై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. ఫలితంగా పవన్ తప్ప.. పార్టీలో పెద్దగా ఎవరి మాటా.. వినిపించడం లేదు. ఎవరూ కనిపించడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.