• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ గుచ్చేశారుగా :...

పవన్ గుచ్చేశారుగా : వైసీపీ అవినీతి మీద యాప్ ఎక్కడ సారూ...?

By - Tupaki Desk
Update: 2022-06-06 16:13 GMT
నాకు కొంచెం తిక్క ఉంది. దానికో లెక్క ఉంది అని ఇప్పటికి పదకొండేళ్ళ క్రితం గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పేల్చిన  పంచ్ డైలాగ్ ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ మార్క్ పంచులు కొన్ని పదులు ఉంటాయి.

ఆయన సభలలో ఆవేశంతో ఊగిపోతూ భయం అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తాను అంటూ పేల్చిన పంచ్ ఎంత కేక పెట్టించిందో అందరికీ తెలుసు. మీ బలుపు తీరుస్తా. మీ సంగతి తేలుస్తా అంటూ ఆవిర్భావ సభ వేదికగా పవన్ వైసీపీ నేతల మీద వాడి వేడి డైలాగులు వాడినా  వచ్చే రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇక చేతిలో ట్విట్టర్ ని ఉంచుకుని దాన్నే గబ్బర్ సింగ్ గన్ మాదిరిగా ప్రయోగించడంతో పొలిటికల్ స్టార్  పవన్ దిట్ట. ఆయన ట్విట్టర్ పేల్చే పంచ్ డైలాగులకు లెక్కే లేదు. వైసీపీ తిక్క తీర్చడానికే ఈ లెక్కలేనితనం అని చెప్పకనే చెబుతూ పవన్ ట్వీట్లు సైలెంట్ గా చేసి మంట పెట్టేస్తారు.

ఇపుడు అలాంటి అదిరిపోయే ట్వీట్ పవన్ నుంచి వచ్చింది. నిజంగా ఇది నేరుగా జగన్ కే టార్గెట్ చేసేలా ఉంది. ఈ మధ్య జగన్ ఏపీలో అవినీతి లేకుండా చూసేందుకు ప్రత్యేకమైన యాప్ ని ఒక దాన్ని రిలీజ్ చేశారు. ఎక్కడ అవినీతి జరిగినా ఈ యాప్ కి ఫిర్యాదు చేయలని కూడా కోరారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ 14400 అనే యాప్‌ను డిజైన్ చేశారన్న మాట. ఈ యాప్‌ను యాంటీ కరప్షన్ బ్యూరో అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ప్రజలు ఈ యాప్‌లో అధికారులపై అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

ఇక ఈ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా  జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఇదో విప్లవాత్మకమైన చర్య అన్నారు. సరిగ్గా ఇక్కడే పాయింట్ పట్టుకున్నారు పవన్. నేరుగా సీఎం  సార్ కే గురిపెడుతూ అంతా బాగానే ఉంది. ఓకేగా ఉంది కానీ మరి వైసిపి పాలకుల అవినీతి గురించి ,వారి ఎమ్మెల్యేల  దోపిడీ సహా దౌర్జన్యాల మీద కంప్లైంట్లు   చెయ్యాలంటే ప్రజలు ఏ యాప్ప్ ని డౌన్ లోడ్  చేసుకోవాలి సారూ అంటూ పవన్ ట్వీటిన తీరు నిజంగా గ్రేటే గేటు అంటున్నారు అంతా.

అవును కదా అది నిజమే కదా. సరైన పాయింటునే పట్టుకుని లాజిక్ తో జనసేనాని వైసీపీ పెద్దల కూసాలు కదిలిపోయేలా ట్వీట్ చేశారు కదా  అని అంటున్నారు. అధికారులు తప్పు చేస్తే యాప్ ఉంది. మరి ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే కూడా యాప్ ఉండాలి కదా. ఏమంటారు. మొత్తానికి ఇలాంటివి పట్తుకుని కెలికి వదిలిపెట్టడంతో జనసేనాని స్పెషాలిటీని  వేరేగా చెప్పాలా.
Tags:    
  • AP 
  • Janasena 
  • pawankalyan 
  • app 
  • apcorruption 
  • apgovernment 
  • ycp 
  • andhrapradesh 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS