ఘోర అవమానం.. పవన్ ఇక రాష్ట్రాన్ని ఎలా ఉద్దరిస్తాడు?

Update: 2019-12-11 08:19 GMT
అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ కు జనసేన ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. ఆ షాక్ తో ఇప్పుడు పవన్ కు ఎలా స్పందించాలో కూడా తెలియని దుర్భర పరిస్థితి నెలకొంది.

గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడంపై జనసేనాని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచి చంద్రబాబుతో కలిసి రోజుకో ట్వీట్ తో జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాడు. జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రవేశపెట్టవద్దని రచ్చ చేస్తూ పోరాడుతున్నారు.

ఈరోజు అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం చదువులపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రవేశపెట్టిన జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. బాబు వదిలేసిన నిర్ణయాన్ని జగన్ అమలు చేశారని.. వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మంచి నిర్ణయం తీసుకుందని.. దీనిని వ్యతిరేకించడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు.  ఎంతో మంది విద్యార్థులు ఇంగ్లీష్ రాకపోవడంతో మంచి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఇంగ్లీష్ లో చదివి బాగుపడుతారని స్పష్టం చేశారు. దీన్ని తప్పు పట్టవద్దని స్వాగతించాలని చెప్పారు.
Read more!

జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ఓ వైపు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించగా.. ఆయన పార్టీ  ఏకైక ఎమ్మెల్యే రాపాక మాత్రం స్వాగతించడం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ జగన్ పై రాపాక ప్రశంసలు కురిపించారు. పవన్ ఒక లాగా .. ఆయన ఎమ్మెల్యే మరోలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. పవన్ కు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీని భజనం చేయడం పవన్ కు శరాఘాతంగా మారింది. దీన్ని బట్టి సొంత పార్టీ నేతలనే కంట్రోల్ చేయలేని పవన్.. ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడన్న విమర్శలు వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News