అంబటి ఓటమికి జనసేన కృషి!

Update: 2019-03-20 14:30 GMT
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో అంబటి రాంబాబుకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సామాజికవర్గం రీత్యా ఒకే కులస్తులు కూడా. అంబటి కూతురు పెళ్లికి కూడా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో పేరున్న కాపు సామాజికవర్గం నేతల్లో అంబటి రాంబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడినా ఈ సారి అంబటికి జగన్ మరోసారి టికెట్ ఖరారు చేశారు కూడా.

ఈ సారి కూడా సత్తెనపల్లిలో బలమైన కమ్మ వర్గం నేత కోడెల శివప్రసాద్ ను అంబటి ఢీ కొడుతున్నారు. గతంలో త్రుటిలో తప్పిన ఓటమిని ఈ సారి సాధించడం అనే విశ్వాసంతో ఉన్నారాయన. ఆర్థికంగా అంబటి అంత స్థితమంతుడు కాకపోయినా.. పార్టీ అంబటిని అక్కడ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది.

ఇక కోడెలపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఆయన గెలుపు కష్టం అనే భావన వ్యక్తం అవుతూ ఉంది. ఇలాంటి నేఫథ్యంలో జనసేన అక్కడ కోడెలను గెలిపించేందుకు కృషి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో రెడ్ల జనాభా గణనీయంగా ఉంది. ఆ సామాజికవర్గం ఓట్లను చీల్చే ఉద్దేశంతో జనసేన అక్కడ రెడ్డి అభ్యర్థిని తెర మీదుకు తీసుకురావడం విశేషం.

ఇదంతా కోడెల ప్లాన్ అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ముందుగా కోడెలతో సమావేశం అయిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఆ తర్వాత వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన టికెట్ ఖరారు అయిపోయింది! రెడ్డి ఓట్లు సాలిడ్ గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే పరిస్థితి ఉన్నా.. కొంతమేర చీలిక తెచ్చి.. వారి ఓట్ల శాతాన్ని తగ్గించే వ్యూహం  ఇక్కడనుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కోడెల గెలుపు వ్యూహంలో పవన్ కల్యాణ్ జనసేన ఇలా ఉపయోగపడుతూ ఉందని - సొంత సామాజికవర్గం ప్రముఖుడిని ఓడించేందుకు కూడా పవన్ కల్యాణ్ తెలుగుదేశం వ్యూహాలను అమల్లో పెడుతున్నారనే కామెంట్ వినిపిస్తోందిప్పుడు!
Tags:    

Similar News