మిర్యాలగూడను వదులు కోబోం..జానారెడ్డి

Update: 2018-11-18 09:13 GMT
తెలంగాణ మహాకూటమిలో ఓ ఐదారు స్థానాలకు  సీట్ల సర్దుబాటు ఇంకా డిసైడ్ అవడం లేదు. నామినేషన్ల ప్రక్రియకు సమయం ముగుస్తుందున ఆశావహులు చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూసి అందరూ నివ్వెరపోతున్నారు. కుదిరితే తన కొడుక్కి లేదా వియ్యంకుడికి సీట్లు ఇవ్వాలని బలవంతం చేస్తున్నారు.

కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే సీటు అన్న నినాదాన్ని వినిపిస్తుంది. అయితే, మొదటి, మలి జాబితాలో కోమటిరెడ్డి బ్రదర్స్ - ఉత్తమ్ కుమార్ లకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టిక్కెట్లు కేటాయించారు. దాంతో జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. చివరి ప్రయత్నం చేస్తున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జానాకు మాంచి పట్టుంది. అంతేగాక, ఆయన పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది.   అందుకే మిర్యాలగూడ సీటును  రఘువీర్ రెడ్డికి - నాగార్జున సాగర్ తనకు కావాలని అడుగుతూ వచ్చారు. కానీ అధిష్టానం ససేమిరా అన్నది. ఒక కుటుంబానికి ఒక సీటు ఇస్తామని తేల్చింది. సీటు నీకా? నీ కొడుకుకా? తేల్చుకో అంటూ రాహుల్ స్పష్టం చేశారు.

ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు టీజేఎస్ కు 8 సీట్లు ఇస్తానని కాంగ్రెస్ చెప్పింది. మిర్యాలగూడ టిక్కెట్ ను టీజేఎస్ అడుగుతోంది. కోదండరాం కు మంచి దోస్త్ అయిన జానా ఆ సీటును టీజేఎస్ తరుపున అయినా   రఘువీర్ రెడ్డికి ఇప్పించాలని భావిస్తున్నారు.  అయితే మిర్యాలగూడ సీటులో జన సమితి నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ కావాలని టీజేఎస్ నేతలు  పట్టుబడుతున్నారు. ఆ సీటు కోసం  సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు.  ఈ పరిస్థితుల్లో  కొడుక్కి ఇవ్వకపోయినా, జన సమితి పార్టీలో ఉన్న తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి  విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి  పైరవీలు చేస్తున్నారు.

  కుదిరితే కొడుకుకు లేదంటే  వియ్యంకుడికి కూటమి టికెట్ కేటాయించుకునే పనిలో  జానారెడ్డి  పడిపోయారు. ఒకవేళ ఇది సాధ్యపడకపోతే కూటమి రెబెల్ గా మిర్యాలగూడలో జానారెడ్డి తనయుడు  రఘువీర్ రెడ్డి   బరిలోకి దిగుతాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.   నామినేషన్లకు మరికొద్ది గంటలే ఉండటంతో జానా ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News