'ముస్లిం మహిళలు గెలిస్తే హిజాబ్ నిబంధనలు కాపాడుకోలేం'

Update: 2022-12-05 10:33 GMT
హిజాబ్.. చాందసవాదం ఈ రెండూ దేశంలో ఎప్పటికీ తరిగిపోని మూఢనమ్మకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక వర్గం వారు ఇప్పటికీ మహిళలకు ముసుగు వేసి వారిని కట్టుబానిసలుగానే చూస్తున్నారు. హిజాబ్ నిబంధనలు అంటూ రచ్చ చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ లొల్లి ఇరాన్ దేశం వరకూ పాకింది. ఇప్పటికీ విద్వేషాలు దేశంలో రెచ్చగొడుతూనే ఉన్నారు.

ఎన్నికల్లో ముస్లిం మహిళలను నిలబెట్టేవారు ఇస్లాంకు వ్యతిరేకమని అహ్మదాబాద్ జామా మసీదు మతగురువు షబ్బీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయా పార్టీలు మగాళ్లకు టికెట్లు ఇచ్చుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇంటింటి ప్రచారం చేయాలి. ఇలా మహిళలు చేయడానికి నేను వ్యతిరేకం.. వీరు కౌన్సిలర్లు, ఎంఎల్ఏలు గెలిస్తే హిజాబ్ రూల్స్ ను కాపాడుకోలేము.. కర్ణాటకలో ఈ పరిస్థితి అని పేర్కొన్నారు.

మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంటింటికీ ప్రచారం నిర్వహించి మతాలకు అతీతంగా అందరితో మాట్లాడాల్సి ఉంటుందని, అందుకే టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.రాజకీయ పార్టీలు నిస్సహాయంగా ఉన్నాయో లేదో తనకు అర్థమయ్యేదని, మహిళా అభ్యర్థులకు సీట్లు రిజర్వ్ చేసే చట్టాన్ని మార్చాలంటూ ఈయన డిమాండ్ చేశారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికలలో మహిళా అభ్యర్థులు పోలీచేయడాన్ని ఈ మతగురువు తప్పుపట్టారు.  "నా అవగాహన ఏమిటంటే, ఈ రోజుల్లో మహిళలు విషయాలను నియంత్రిస్తున్నారని వారు అనుకుంటున్నారు.

కాబట్టి వారు మహిళలను ట్రాప్ చేస్తే, వారు మొత్తం కుటుంబాన్ని ట్రాప్ చేయవచ్చు. వారి నిర్ణయం వెనుక వేరే ఉద్దేశ్యం నాకు కనిపించడం లేదు."అంటూ ముస్లిం మహిళలను పావులుగా వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News