కేవీపీని బట్టలూడదీసి కొట్టాలన్న టీడీపీ నేత!

Update: 2016-11-09 04:36 GMT
రాజకీయాల్లో చేసుకునే విమర్శలకు నైతికత - నిజానిజాల సంగతి పక్కనపెడితే... కనీసం విజ్ఞత కూడా కనిపించకుండాపోయిన రోజులివి. పదిమందికి చెప్పాల్సిన స్థానంలో ఉన్నవారు కూడా పదిమంది అసహ్యించుకునేలా.. ముక్కున వేలేసుకునేలా మాట్లాడుతున్నారు! తాజాగా జలీల్ ఖాన్ ఈపనికి పూనుకున్నారు. ఫిరాయింపుల ద్వారా అధికారపార్టీ పంచన చేరిన (అనధికారిక) టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నోటికి పనిచెప్పారు. తాము చేసిన పని ఎంత అనైతికమో - ప్రజాస్వామ్యాన్ని అవహేలన చేయడమో తెలిసిన కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కామ్ గా ఉంటున్నా... అవన్నీ వదిలేసినవారిలో కొందరు మాత్రం తమ నోటికి అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరినప్పటి నుంచి ఎగిరెగిరిపడుతున్న విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంత్రి పదవిపై ఆశతోనో ఏమో కానీ తెగ ఆవేశపడిపోయి అందరినీ తిడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా... కాంగ్రెస్ ఎంపీ కేవీపీపై తన నోటి దురుసుతనం చూపించారు. కేవీపీని బట్టలూడదీసి కొట్టాలన్న జలీల్ ఖాన్... కేవీపీని పోలీస్‌ స్టేషన్‌ లో పెట్టి బట్టలూడదీసి కొడితే వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుందని చెప్పారు.

కాగా మంత్రి పదవి ఆశ చూపడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జలీల్ ఖాన్ కు ఇప్పట్లో ఆ ఆశ తీరే అవకాశం కనిపించడం లేదు. అయితే... ఇతరపార్టీ నేతలను ఎంత బలంగా తిడితే టీడీపీలో అంత మైలేజీ ఉంటుందనే ఒక రూమర్ ఉండటంతో ఆ ఆప్షన్ ని కూడా జలీల్ ఖాన్ వాడేస్తున్నట్లున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితుల్లో జంపింగ్ జపాంగులకు మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగేపనిలా కనిపించకపోయినా... ఆశ చావని జలీల్ ఖాన్ మాత్రం చంద్రబాబును తెగ పొగుడుతూ... చంద్రబాబు మెప్పు కోసం జగన్ ను - చంద్రబాబును వ్యతిరేకించే ఇతర నేతలను నోటికొచ్చినట్లు తిడుతూ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల జలీల్ నోటి దురద తీరుతుందే తప్ప మంత్రి పదవి కోరిక తీరుతుందో లేదో వేచి చూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News