8 జిల్లాల్లోని పేదలకు జగన్ గుడ్ న్యూస్

Update: 2020-06-24 02:30 GMT
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న సీఎం జగన్ కరోనా వేళ కూడా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డిసైడ్ అయ్యాడు. తాజాగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.

సొంతింటి పథకం కోసం తొలి విడతలో 8 జిల్లాలకు రూ.459.32 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.

తొలి దశలో నెల్లూరు, కర్నూలు జిల్లాలకు రూ.80 కోట్లు, విశాఖపట్నంకు రూ.39.32 కోట్లు, అనంతపురంకు రూ.60 కోట్లు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు.

సీఎం జగన్ ఈ సొంతింటి పథకాన్ని వైఎస్ఆర్ జయంతి జూలై 8న ప్రారంభించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలను కూడా ఇదేరోజున పంపిణీ చేయనున్నారు.
Tags:    

Similar News