కేరళంలో కమలం వికసిస్తుందా ?
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలను ప్రకటించింది. ఈ మెరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.;
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలను ప్రకటించింది. ఈ మెరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో ఈ వేసవిలో అసలైన సమ్మర్ మొదలైంది రాజకీయంగా అసలే ఢీ అంటే ఢీ కొడుతున్న ఎన్ డీయే ఇండియా కూటముల మధ్య అసెంబ్లీ ఎన్నికలు సరి కొత్త సమరానికి తెర తీశాయని చెప్పాలి. ఇక చూస్తే ఈ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీకి అసాం పుదుచ్చేరిలలోనే అధికారం ఉంది. మిగిలిన మూడు కీలక రాష్ట్రాలలో చూస్తే బీజేపీ విపక్షంలో ఉంది.
గట్టి సవాళ్ళ మధ్య :
పైగా పశ్చిమ బెంగాల్ లో తప్ప తమిళనాడు, కేరళలో మరింత రాజకీయ సవాళ్ళు ఎదుర్కొంటోంది. తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీ అన్నా డీఎంకేతో జట్టు వల్ల అధికారం ఆశలు ఉన్నాయి కానీ కేరళంలో అయితే బీజేపీది పూర్తిగా ఒంటరి పోరుగానే చెప్పాలి పైగా అక్కడ అయితే లెఫ్ట్ కూటమి లేదా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయి. మధ్యలో మరే పార్టీకి చాన్స్ ఉండదు, పైగా కేరళంలో బీజేపీ మార్క్ హిందూత్వ కార్డు ఏ మేరకు చెల్లుతుంది అన్నది చర్చగానే ఉంది.
ఆ రెండు కూటములే :
ఇక కేరళంలో చూస్తే 2021లో జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 సీట్లతో అధికారాన్ని నిలుపుకుంది.1977 తర్వాత రాష్ట్రంలో ఒక కూటమి వరుసగా రెండోసారి గెలుపొందడం ఇదే మొదటిసారి. ఇక ఆ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ 41 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అంతకు ముందు తాము గెలుచుకున్న నేమోమ్‌లోని ఏకైక స్థానాన్ని కోల్పోయింది. అలాగే ఓట్ల వాటా పెద్దగా రాబట్టుకోలేదు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురం లోక్ సభ సీటుని బీజేపీ గెలుచుకుంది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం మేయర్ సీటుని కూడా గెలుచుకుంది. దాంతో ఇపుడు బీజేపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
వ్యూహాత్మకంగానే :
అయితే ఈ ఏడాది ఏప్రిల్ 9 జరిగే కేరళం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ ఎన్నికల్లో తలపడనుంది. బిజెపి అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలాగే ప్రతిపక్షంలో ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సాంప్రదాయ పార్టీలని ఎండగడుతోంది. అలాగే రెండు పార్టీలు రెండు కూటముల రాజకీయాలను దెబ్బతీయాలని గట్టిగానే పనిచేస్తోంది. మూడవ పార్టీ కొత్త ఆల్టర్నేషన్ అవసరం అని జనాల్లోకి వెళ్ళి చాటుతోంది ప్రజలలో మార్పు రావాలని చూస్తోంది. ఇక చూస్తే బీజేపీ నేపథ్యంలో ఒక సీటు గెలిచింది.
ఎదగాలని బీజేపీ చూస్తోంది :
అలా పార్టీ తన ఉనికిని విస్తరిస్తోంది. అంతే కాదు ఇటీవల సంవత్సరాలలో తన ఓట్ల వాటాను పెంచుకుంది. ఈ మధ్యనే కేరళం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. లెఫ్ట్ నాయకత్వంలోని ప్రభుత్వం మీద ఆయన విమర్శలు సంధించారు. అయితే కేరళంలో ప్రజలు కమలం పార్టీని ఏ మేరకు ఆదరిస్తారు అన్నది చూడాలి. అక్కడ వామపక్షాలకు కొంత బలం తగ్గుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ లో వర్గ పోరు ఉంది. వీటి మధ్యనే ఎదగాలని బీజేపీ చూస్తోంది. మొత్తం 140 సీట్లు ఉన్న కేరళంలో బీజేపీ తన ఇన్నింగ్స్ ని ఎన్ని సీట్లతో మొదలుపెడుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.