బాబాయి విజయానికి జగన్ ప్లానింగ్

Update: 2016-10-25 06:57 GMT
 ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. రాయలసీమ పట్టభద్రుల - ఉపాధ్యాయుల మండలి స్థానానికి... కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఆ పార్టీ అధినేత జగన్ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో దిగేందుకు రంగం సిద్ధమవుతోంది. జగన్ దీనిపై ఇప్పటికే పార్టీ నేతలకు సంకేతాలు పంపించారని... బాబాయిని మంచి ఆధిక్యంతో గెలిపించి పట్టు నిరూపించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పది రోజులుగా వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు.  

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైఎస్ వివేకానందరెడ్డి దిగుతుండడంతో టీడీపీ కూడా పావులు కదుపుతోంది. టీడీపీ నుంచి పులివెందులకే చెందిన బీటెక్ రవిని పోటీకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న కడపలో జరిగే టీడీపీ సమస్వయ కమిటీ సమావేశంలో అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఉపాధ్యాయుల స్థానం - పట్టభద్రుల స్థానానికి కూడా పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అందరి దృష్టీ స్తానిక సంస్థల ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా చాలాకాలంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ గా లేని వివేకా ఇక్కడ పోటీ చేస్తుండడం.. ఆయన కోసం జగన్ స్వయంగా నేతలకు సూచనలు చేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News