ఆంధ్రజ్యోతి కథనంపై యాక్షన్ ప్లాన్ కి సిద్దమౌతున్న జగన్ సర్కార్ !

Update: 2020-08-15 16:30 GMT
ఆంధ్రజ్యోతి .. జగన్ సర్కార్ మధ్య మరోసారి రచ్చ మొదలైంది. తాజాగా ఆంధ్రజ్యోతి ఏపీలో అధికారంలోకి ఉన్న జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ఏపీ సర్కార్ మండిపడుతుంది. అలాగే దీన్ని న్యాయ వ్యవస్థ ముందుకు తీసుకువెళ్లి , ఆ కథనం వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి , అలా రాయడానికి గల కారణాలని బయటపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆంధ్రజ్యోతి కథనం ఏమిటి అంటే .. ‘న్యాయ దేవతపై నిఘా’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ న్యాయ దేవతపై నిఘా .. కథనం పై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యి , సదురు మీడియా సంస్థపై చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పత్రిక అలా ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వానికి , న్యాయవ్యవస్థ కి మధ్య కొన్ని పొరపచ్చాలు రావచ్చు. ఆలా న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న మంచి సంబంధాలని దెబ్బతీసేందుకు కుట్రలో పన్ని , పక్కా ప్రణాళికతోనే ఈ కథనం అల్లారని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుమ్మకై , పక్కా వ్యూహంతోనే న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించడంలో భాగంగా ఆ కథనాన్ని ప్రచురితం చేశాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ తప్పుడు కథనంపై చట్ట ప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అలాగే న్యాయ దేవత పై నిఘా అనే కథనం పై డైరెక్ట్ గా న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు జరిపి, ఆ కుట్ర కోణాన్నీ బహిర్గతం చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News