• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు ముఖ్యమంత్రి కాదు.....

బాబు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ అట

By - Tupaki Desk
Update: 2017-02-06 09:32 GMT
ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై విపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన చంద్రబాబును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ ఉదాహరణలు, వివరణలు, ఉపమానాలతో జగన్ మాట్లాడుతుంటే మాటమాటకూ ప్రజలు చప్పట్లు చరుస్తూనే ఉన్నారు.  ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేతకానితననాన్ని జగన్ ఏకిపడేశారు. తొమ్మిదేళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
    
వైఎస్‌ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని.. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోతోందన్నారు.  చంద్రబాబునాయుడు అసలు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని జగన్ అన్నారు.  రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందన్నది వివరించారు.  ఒకప్పుడు రాజస్థాన్‌ లోని జైసల్మీర్‌ లో అతి తక్కువ వర్షపాతం ఉండేదని, ఇప్పుడు అనంతపురం జైసల్మేర్ తో పోటీ పడుతోందని జగన్ చెప్పారు.  అనంతపురం ప్రజలను ఆదుకోవాలంటే   హంద్రీనీవా సుజల స్రవంతి ఒక్కటే మార్గమని చెప్పారు.
    
హంద్రీనీవాను రాజశేఖరెడ్డి హయాంలోనే 90 శాతం పూర్తి చేశారని..  ఈ పథకంతో రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీనికి సంబంధించి 6800 కోట్లు ఖర్చవుతాయని..  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  4వేల పైచిలుకు కోట్ల నిధులను కేటాయించి పనులు చేశారని చెప్పారు. అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తయి కేవలం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు మాత్రమే ఉన్నాయని, చంద్రబాబు అది కూడా పూర్తి చేయలేకపోతున్నారన్నారు. ఆ పది శాతం పనులు పూర్తి చేసి ఉంటే హంద్రీనీవా మొదటి దశ పూర్తయ్యేదన్నారు.
    
రాష్ట్రంలో నిరుద్యోగులకు చంద్రబాబు భారీగా బకాయిపడ్డారని.. ఆయన గెలిస్తే నిరుద్యోగులకు జాబు వస్తుందని చెప్పారని, అలా ఇవ్వకుంటే నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కన ప్రతి నిరుద్యోగికీ మొత్తం 32 నెలల చంద్రబాబు పాలన కాలానికి రూ.64 వేలు చొప్పున ఇవ్వాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagan 
  • Chandrababu Naidu 
  • Irrigation Projects 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS