లేడీ ఎంపీ తీరుపై జగన్ ఫైర్

Update: 2017-07-15 09:54 GMT
వైసీపీ అధినేత జగన్ తమ పార్టీకి చెందిన మహిళా ఎంపీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరు కాలేదు. ఆమె నిన్ననే ఏపీ మంత్రి - టీడీపీ నేత లోకేశ్ ను కలిశారు. ఈ నేపథ్యంల ఈ రోజు జరిగిన పార్టీ సమావేశానికి ఆమె రాకపోవడంతో జగన్ తీవ్ర ఆగ్రహానికి లోనయినట్లు తెలుస్తోంది. ఎంపీలు దారి తప్పుతున్నారంటూ ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ప్రజల కంటే సొంత వ్యాపారాలకే పెద్ద పీట వేస్తున్నారంటూ ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
    
కాగా బుట్టా రేణుక హాజరుకాకపోవడం.. నిన్న ఆమె లోకేశ్ ను కలవడంతో పాటు.. పలువురు ఇతర ఎంపీల తీరు తెన్నలపైనా సీరియస్ గా ఉన్న ఆయన ఆ కోపంతో సమావేశాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ముగించారని తెలుస్తోంది. మొన్నటి ప్లీనరీ తరువాత పార్టీకి మంచి ఊపు వస్తుండడంతో ఈమధ్య బాగా హుషారుగా ఉంటున్న జగన్ ఈ రొజు సమావేశంలో మాత్రం సీరియస్ గా ఉన్నారని పలువురు ఎంపీలు అంటున్నారు.
    
ఎంపీల పని తీరు కూడా బాగులేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుందని జగన్ అన్నట్టు సమాచారం. ప్రజలతో మమైకం కావాలని, సొంత వ్యాపారాలకు దూరంగా ఉండాలని ఎంపీలతో జగన్ అన్నట్లు తెలుస్తోంది.  పార్టీ రోజురోజుకీ బలపడుతున్న తరుణంలో ఎంపీలు ఇలా దారి తప్పుతుండడంతో ఆయన సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News