• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆధారాల‌తో స‌హా లీకేజీని...

ఆధారాల‌తో స‌హా లీకేజీని వివ‌రించిన జ‌గ‌న్‌

By - Tupaki Desk
Update: 2017-03-28 09:57 GMT
అధికార టీడీపీ నేత - ఏపీ మంత్రి నారాయ‌ణకు చెందిన నారాయణ హైస్కూల్‌ లో టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బయటపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్ర‌స్తావిస్తూ సభలో ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక చూపించారు. ఇందుకు బాధ్యులైన మంత్రులు నారాయణ - గంటా శ్రీనివాసరావులను భర్తరఫ్‌ చేయాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన‌డం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల వంత‌యింది. అవినీతిని బ‌య‌ట‌పెడుతూంటే మైక్ క‌ట్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. వైఎస్‌ జగన్‌ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పలుమార్లు వెల్‌ లోకి దూసుకెళ్లి  వైఎస్‌ ఆర్‌ సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మూడోసారి స్పీకర్‌ వాయిదా వేశారు.

మ‌రోవైపు ప‌రీక్షా ప‌త్రాల లీకేజీ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ ల  వల్లే నారాయణ కాలేజ్‌ కు ర్యాంక్‌ లు వస్తున్నాయని అనుమానం వ్య‌క్తం చేశారు. పేపర్‌ లీక్‌ కు తమకు సంబంధం లేదని మంత్రి నారాయణ మీడియా పాయింట్‌ లో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిజంగా మంత్రులు - ముఖ్యమంత్రి తప్పుచేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని వారిని శిక్షించి మీ సశ్చిలతను నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని సూచించారు. దొంగలెవరూ దొంగతనం చేశామని ఒప్పుకోరని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులు తిండి తిప్పలు మానేసి అహర్నిషలు కష్టపడి చదువుతుంటే లీక్‌ లు చేసుకుంటే నారాయణ కళాశాల ర్యాంకులు కొట్టుస్తుందని పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు.  నెల్లూరులో పేపర్‌ ఎందుకు లీక్‌ అయ్యిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లీకేజీల‌పై నేరుగా స‌మాధానం చెప్ప‌లేక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో ఎదురుదాడికి దిగేలా సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డం దౌర్భ‌గ్య‌మ‌ని  పుష్పశ్రీవాణి అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagan 
  • 10th class question paper leakage 
  • Andhra Assembly 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS