బెజవాడ బాట పట్టాల్సిన టైం వచ్చేసింది

Update: 2015-09-11 09:15 GMT
ఏపీ రాజధానికి వీలైనంత త్వరగా హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా తాజాగా ఏపీ సీఎస్ (చీఫ్ సెక్రటరీ) ఐవైఆర్ కృష్ణారావు అడుగులేశారు.

ఏపీ ముఖ్యమంత్రితోనూ తాను విజయవాడలోనే ఉంటానని.. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తానని చెప్పినట్లే.. కృష్ణారావు శుక్రవారం తన ఛాంబర్ లోకి అధికారికంగా ప్రవేశించారు.ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు.

ఏపీ సీఎస్ తాజా గృహప్రవేశంతో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలకమైన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు విజయవాడలోనే మకాం వేసినట్లు అయ్యింది. దీంతో.. వివిధ మంత్రిత్వ శాఖలు.. శాఖాధిపతులు.. కార్యాలయాల సిబ్బంది మొత్తం విజయవాడ బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైనట్లే. విభజన జరిగి 15 నెలలు అవుతున్నా.. హైదరాబాద్ లోని కార్యాలయాల్ని తరలించే ప్రక్రియ పెద్దగా ముందుకు సాగలేదు. తాజాగా ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇద్దరూ బెజవాడలోనే మకాం పెట్టేసిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏపీ క్యాడర్ ఉద్యోగులు బెజవాడ బాట పట్టక తప్పని పరిస్థితి. మరి.. దీనికి ఏపీ ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందో..?
Tags:    

Similar News