రేవంత్ పాదయాత్ర వెనుక అసలు వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత.. రానున్న రోజుల్లో పార్టీకి కాబోయే కొత్త సారథిగా అభివర్ణిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇటీవల తన పాదయాత్రను ప్రకటించటమే కాదు.. అదే వేదిక మీద నుంచి సరాసరి షురూ చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడు పాదయాత్రను మొదలు పెట్టటం అంత తేలికైన విషయం కాదు. దాని కోసం చేయాల్సిన ప్రిపరేషన్ భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. అలాంటిది.. ఒక సభలో పాల్గొని.. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించి.. పాదయాత్ర చేసిన వైనం వెనుక వ్యూహం వేరే అన్న మాట బలంగా వినిపిస్తోంది.
టీ పీసీసీ చీఫ్ పదవిని సొంతం చేసుకునేందుకు రేవంత్ భారీగానే పావులు కదిపారు. ఒకదశలో ఆయన పేరు కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా రేవంత్ తో పాటు... మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెర మీదకు రావటం.. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉండటంతో.. అసలేం జరగబోతోందన్న ఆసక్తి వ్యక్తమైంది. ఈ సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ రథసారధిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సీనియర్ నేత జానారెడ్డి నోటి నుంచి రావటం.. ఆ వెంటనే కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెప్పేయటం తెలిసిందే.
అయితే.. జానారెడ్డి ప్రకటన వెనుక రేవంత్ ఉన్నారని చెబుతున్నారు. తనకు పోటీగా జీవన్ రెడ్డి తెర మీదకు రావటం.. ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికను పక్కన పెట్టేందుకు జానారెడ్డి రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. పార్టీ నిర్మాణంలో తనకున్న కమిట్ మెంట్ ను తెలియజేసేందుకు వీలుగా పాదయాత్రను ప్రకటించినట్లుగా చెబుతున్నారు.
అలా అని.. పార్టీ హైకమాండ్ అనుమతి లేకుండా పాదయాత్ర చేయటం రేవంత్ కు మైనస్ గా మారే ప్రమాదం ఉంది. అందుకే.. స్వల్ప దూరాన్ని తొలుత పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించటం.. అది కూడా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా ఉండేలా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. తనకు పోటీగా మరెవరూ ఉండకూడని రీతిలో ఉండేందుకే రేవంత్ పాదయాత్రను చేపట్టినట్లుగా చెప్పక తప్పదు. ఏమైనా.. రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. కాకుంటే.. మీడియాలో ఆయన ఊహించిన దాని కంటే తక్కువగా పాదయాత్రకు కవరేజ్ లభించటం గమనార్హం.