కరోనా: ర్యాపిడ్ టెస్టులతో ప్రయోజనం లేదా?

Update: 2020-08-22 05:45 GMT
కరోనాను కంట్రోల్ చేయాలంటే భారీగా ర్యాపిడ్ టెస్టులు చేయాలని కేంద్రం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కేసులను ట్రేస్ చేసేందుకు అవే పనులు చేస్తున్నాయి. కానీ ఇక్కడ గందరగోళం మొదలైంది. ర్యాపిడ్ టెస్టులతో ఫలితాలు సరిగా రావడం లేదనే అపవాదు నెలకొంది.

ఏపీలో వేలకు వేల టెస్టుల వెనుక ఈ ర్యాపిడ్ టెస్టులే ఉన్నాయి. ఈ క్రమంలోనే రోజుకు 10వేల కేసులు వెలువడుతున్నాయి. ఈ కేసులపై అనుమానాలు బోలెడున్నాయి.

ఈ క్రమంలోనే ర్యాపిడ్ టెస్టులతో ప్రయోజనం లేదని.. వీటిపై సొమ్మును వృథా చేసుకోకూడదని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా 51శాతం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించాలని రఘుశర్మ కోరారు.

కాగా  ర్యాపిడ్ టెస్టులతో సరైన ఫలితాలు రావడం లేదనే ఆరోపణలు గత కొంతకాలం నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ టెస్టులు ఆపించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News