1.2 కోట్ల కొలువులు.. యువత గెట్ రెడీ
తుమ్మితే ఉద్యోగాలు పోయే కాలం ఇదీ.. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయి.. 20 ఏళ్లు సంస్థను పట్టుకొని అష్టకష్టాలు పడి పనిచేసిన సీనియర్లను అని కూడా చూడకుండా సాగనంపుతున్న దారుణ పరిస్థితులు కంపెనీల్లో నెలకొన్నాయి.;
తుమ్మితే ఉద్యోగాలు పోయే కాలం ఇదీ.. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయి.. 20 ఏళ్లు సంస్థను పట్టుకొని అష్టకష్టాలు పడి పనిచేసిన సీనియర్లను అని కూడా చూడకుండా సాగనంపుతున్న దారుణ పరిస్థితులు కంపెనీల్లో నెలకొన్నాయి. ఐటీ రంగం ఏఐ రాకతో చిగురుటాకులా వణుకుతోంది. ఏఐ, ఆటోమేషన్ తో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలోనే ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. 2026లో కొత్త కొలువులు వస్తున్నాయన్న మాటలు హాయిగా అనిపిస్తున్నాయి.
నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త ఇది. 2026 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు మరింత వేగం పుంజుకోనున్నాయని ప్రముఖ హ్యూమన్ రిసోర్స్ సంస్థ టీమ్ లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు సృష్టయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది భారీ సంఖ్య కావడం గమనార్హం.
టెక్నాలజీ, ఏఐ రంగాల్లో హైరింగ్ జోరు
డిజిటలైజేషన్, ఆటోమేషన్ వేగం పెరగడంతో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రముఖ కార్పొరేట్లు భారీగా నియామకాలకు సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్, ఈవై, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు అనుభవజ్ఞుల నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
క్యాంపస్ హైరింగ్‌కు ఊపు
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ నేపథ్యాల నుంచి వస్తున్న ఫ్రెషర్లకు మంచి అవకాశాలు లభించనున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను విస్తరించడంతో పాటు స్కిల్-బేస్డ్ హైరింగ్‌పై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. కోడింగ్, క్లౌడ్, ఏఐ టూల్స్‌లో నైపుణ్యం ఉన్న యువతకు అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
మహిళలు, వైవిధ్యానికి ప్రాధాన్యం
ఈసారి నియామకాలలో మరో విశేషం ఏమిటంటే.. మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు అధిక ప్రాధాన్యం. సంస్థలు డైవర్సిటీ & ఇన్‌క్లూజన్ విధానాలను బలోపేతం చేస్తూ.. మహిళా ఉద్యోగుల వాటాను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇది ఉద్యోగ రంగంలో సమాన అవకాశాలకు దారితీయనుంది.
నిరుద్యోగ యువతకు ఆశాకిరణం
మొత్తంగా 2026 సంవత్సరం ఉద్యోగార్థులకు ఆశాజనకంగా మారనుంది. సరైన నైపుణ్యాలు పెంపొందించుకుని, మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్లు సిద్ధమైతే ఈ 1.2 కోట్ల కొలువుల అవకాశాల్లో తమ స్థానం దక్కించుకోవడం యువతకు సాధ్యమే.