వూహాన్ కు అమెరికా నిధుల వరద నిజమా?
ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా వేళ.. కొత్త సిద్దాంతాలు.. సరికొత్త కుట్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నించి ఆరోపించినట్లుగా కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ లోని ల్యాబ్ నుంచి కరోనా వైరస్ కారకాలు బయటకు రావటం.. ఇప్పుడీ వేళ.. ప్రపంచాన్ని చుట్టుముట్టి అల్లకల్లోలం చేస్తున్నట్లుగా చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికి బయటకు రాలేదు. ఆ పుస్తకంలోనో.. ఆ పరిశోధన పత్రంలోనో.. ఆ రిపోర్టులోనో అంటూ అప్పుడప్పుడు సంచలన వార్తాంశాలుగా మారుతున్నాయే తప్పించి.. ఇప్పటివరకు వూహాన్ ల్యాబ్ లో ఏం జరిగిందన్న అంశంపై క్లియర్ గా చెప్పినోళ్లు లేరు.
ఇదిలా ఉంటే.. వూహాన్ ల్యాబ్ కు అమెరికా నుంచి కూడా నిధుల వరద పారినట్లుగా కొత్త ఆరోపణ కొంతకాలంగా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. అమెరికా నుంచి నిధులు వెళ్లాయంటే.. అమెరికా ప్రభుత్వమే ఇచ్చిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. అమెరికాకు చెందిన ఒక పరిశోధన సంస్థ వూహాన్ ల్యాబ్ తో టైఅప్ చేసుకున్నట్లుగా వాదన ఉంది.
దీనికి తగ్గట్లే ఇప్పుడు కొన్ని వాదనలు తెర మీదకు వచ్చాయి. గతంలో సార్స్.. మెర్స్ వ్యాధులకు కరోనా వైరస్ లే కారణమైనందున.. ఒకే కుటుంబానికి చెందిన ఈ వైరస్ తో ఫ్యూచర్ లో వచ్చే ప్రమాదాల్ని పసిగట్టి.. నివారణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు భావించినట్లు చెబుతారు. ఆ దిశగా వూహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ పై ప్రయోగాలు జరిపి ఉంటుందని.. ఆ ప్రయోగ ఫలితాలు తమతో పంచుకోవాలనే షరతుపై ఒక అమెరికా పరిశోధన సంస్థ ఆర్థిక సాయం అందించిందన్న వాదన ఉంది.
అంటే.. అమెరికా ప్రభుత్వం వూహాన్ ల్యాబ్ కు నేరుగా నిధులు పంపలేదు. అయితే.. అమెరికా జాతీయ ఆరోగ్య పరిరక్షణ సంస్థ అనుబంధ విభాగమైన జాతీయ అలర్జీ.. అంటువ్యాధుల నివారణ సంస్థ ద్వారా ఎకో హెల్త్ ఆలయన్స్ అనే లాభాపేక్ష లేని రీసెర్చ్ సంస్థకు నిధులు చేరినట్లుగా వాదన ఉంది. అక్కడి నుంచి వూహాన్ ల్యాబ్ కు నిధులు వెళ్లినట్లుగా చెబుతారు.
అయితే.. జాతీయ అలర్జీ.. అంటువ్యాధుల నివారణ సంస్థకు చీఫ్ మరెవరో కాదు.. ఫౌచీ. అమెరికాలో కరోనా కంట్రోల్ మీదా.. దానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఫౌచీకి సంబంధించిన సంస్థ మీదనే ఆరోపణలు రావటం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే.. చిన్న లాజిక్ చాలామంది మిస్ అయినట్లుగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని వణికించే జీవాయుధాన్ని చైనా తయారు చేస్తుంటే.. అమెరికా నిధులు ఇస్తుందా? అది కూడా సమాచారాన్ని పంచుకోవటానికి? తన శత్రు దేశంతో సమాచారాన్ని పంచుకునే కన్నా.. ఆ ప్రయోగాన్ని తాము సొంతంగా చేస్తే.. డ్రాగన్ దేశం కంటే మరో అడుగు ముందు ఉంటుంది కదా? అమెరికా లాంటి దేశం చైనాకు ఛాన్సు ఇస్తుందంటారా?