లోకేష్ కంటే పులివెందుల ‘రెడ్డి’ బెటరా?

Update: 2020-08-07 07:50 GMT
టీడీపీలో ఇప్పుడు రాజీనామాల రాజకీయం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వగానే ఏకంగా రాజీనామాకు రెడీ అయ్యారని అందరూ భావించారు. కానీ ఆ సమయం పూర్తికాగానే వైసీపీ వాళ్లే రాజీనామా చేయాలంటూ తుస్సుమనిపించాడు. చంద్రబాబు ఏదో చేస్తాడనుకుంటే ఏదో చేశాడని టీడీపీ శ్రేణులంతా నివ్వెరపోయారు.

అమరావతి రాజధాని మార్చడంపై కలత చెందిన పులివెందుల టీడీపీ ఎమ్మెల్సీ అయిన బీటెక్ రవి మండలి ఫార్మాట్ లో రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు.. తోటి ఎమ్మెల్సీ అయిన లోకేష్ కూడా చేయని సాహసాన్ని చేసి శభాష్ అనిపించుకున్నాడు. పదవులు కాదు శాశ్వతం.. ప్రజల అభిప్రాయాలని చాటిచెప్పారు.

అయితే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మాత్రం ట్విట్టర్ లో పిట్ట కథలు చెబుతుంటే ఎవరు నమ్ముతారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. దమ్ము ఉంటే వాళ్ల తండ్రి కుప్పం ఎమ్మెల్యేగా.. లోకేష్ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయవచ్చు కదా అని సవాల్ చేస్తున్నారు. ఏదో 48 గంటల డెడ్ లైన్ అని మీడియాను తన వైపు తిప్పుకున్నాడు తప్పితే చేసింది ఏమీ లేదు అని.. డెడ్ లైన్ పెట్టింది చంద్రబాబు అయితే వైసీపీ వాళ్లు రాజీనామాలు చేయాలని అనడం నవ్వులపాలైందని ఇన్ డైరెక్ట్ గా టీడీపీ వర్గాలే ఆడిపోసుకుంటున్నాయట..

ఇలా రాజీనామాల విషయంలో తండ్రికొడుకులు చంద్రబాబు-నారాలోకేష్ మాట తప్పారని.. పులివెందుల పౌరుషం ఉన్న బీటెక్ రవి మాత్రం రాజీనామా చేసి వారిద్దరికంటే బెటర్ అని నిరూపించుకున్నాడని టీడీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News