• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా అధ్యక్షబరిలో...

అమెరికా అధ్యక్షబరిలో భారతీయురాలు?

By - Tupaki Desk
Update: 2018-08-13 06:49 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అంటే మమూలు విషయం కాదు.. ప్రపంచాన్నే శాసించగల అత్యున్నత పదవి. అంతటి పదవి కోసం తీవ్ర పోటీ ఉంటుంది. వచ్చే 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే చర్చ తాజాగా ఆ దేశంలో ఊపందుకుంది. కొందరు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాలపై సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.

వచ్చేసారి అమెరికా అధ్యక్షబరిలో ఎవరనే విషయంలో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారతీయ అమెరికన్ కమలా ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కమలా హ్యారిస్ ప్రస్తుతం క్యాలీఫోర్నియా సెనేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాలిఫోర్నియా అటార్న్ జనరల్ పదవిని కూడా నిర్వహించారు. గడిచిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడిన హిల్లరీ క్లింటన్ కు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. కమల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలు, నియామకాలు, దుబారా ఖర్చుపై నిలదీస్తూ ఫేమస్ అయ్యారు..

ఇటీవల డెమెక్రాటిక్ పార్టీ నేతలు, ఓటర్లపై టెలీఫోన్ సర్వే నిర్వహించగా దాదాపు 70శాతం మంది వచ్చేఎన్నికల్లో కమలానే అధ్యక్ష బరిలో నిలవాలని చెప్పడం విశేషం. ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్టు కూడా కమలా డెమొక్రట్స్ తరఫున అత్యుత్తమ అభ్యర్థిని అభిప్రాయపడింది.

కమల తల్లి  శ్యామలా  తమిళనాడుకు చెందిన వారు. బెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలైన ఈమె 1960లో అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. కమల తండ్రి పేరు డొనాల్డ్ హ్యారిస్. ఈయన  ఆఫ్రికా సంతతికి చెందిన వారు.. 1964లో కమల జన్మించారు. కమల తాత పీవీ గోపాలన్ దౌత్యవేత్తగా చెన్నైలోని బీసెంట్ నగర్ లో ఉన్నప్పుడు కమల సెలవుల్లో తరచుగా చెన్నైకి వచ్చింది. ప్రస్తుతం కమలా వచ్చే సారి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తుందనే వార్త తెలియడంతో ఎన్నారైలు - భారతీయులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Tags:    
  • Kamala Harris 
  • 2020 Presidential Candidate 
  • USA 
  • Telugu NEws 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS