టీడీపీ ’ఆ ప్రస్తావన’ తేకపోవటమే మంచిదా ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ అనవసరంగా తేనెతుట్టెను ప్రస్తావిస్తోందా ? అభ్యర్ధి, ఇతర నేతలు ప్రచారాన్ని గమనించిన వారిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. అభ్యర్ధితో పాటు నేతలు తమ ప్రచారంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేకపోయినా వాళ్ళు టార్గెట్ చేస్తున్న అంశాల్లో ప్రత్యేకహోదా విషయమే ఉంటోంది. హోదాను సాధించటంలో జగన్ ఫెయిలయ్యారని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
ఇక్కడ టీడీపీ నేతలు మరచిపోయిన విషయం ఏమిటంటే హోదా విషయంలో జగన్ ఫెయిల్యూర్ కన్నా ముందు చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారని. విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం చంద్రబాబు. కాబట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హయాంలో రాష్ట్రానికి జరిగిన ప్రతి అన్యాయంలో చంద్రబాబు బాధ్యతే ఎక్కువుంటుందనటంలో సందేహంలేదు.
హోదాను తేవటంలో జగన్ ఫెయిల్యూర్ అయ్యారనే అనుకుందాం. కానీ కేంద్రం ప్రత్యేకహోదా అంటే హోదా అని లేకపోతే ప్రత్యేకప్యాకేజి అంటే ప్యాకేజీని యూటర్నులు తీసుకోలేదు. ఏపికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వదని తెలిసి కూడా జగన్ మాత్రం హోదా ఇవ్వాల్సిందే అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం హోదా అని కొంతకాలం, ప్యాకేజీనే బ్రహ్మాండమని మరికొంత కాలం యూటర్నులతోనే తన ఐదేళ్ళు గడిపేశారు.
కాబట్టి టీడీపీ నేతలు తమ ప్రచారంలో హోదా విషయాన్ని ప్రస్తావిస్తుంటే జనాలకు చంద్రబాబు ఫెయిల్యూర్ కూడా గుర్తుకొస్తుంది. హోదాను పదే పదే ప్రస్తావించటం ద్వారా టీడీపీకి వచ్చే ఉపయోగం ఏమీ ఉండకపోగా నష్టమే ఎక్కువ. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, పథకాల అమలులో వైఫల్యాలు ఏవన్నా ఉంటే వాటిని టచ్ చేయటం వల్ల ఉపయోగం ఉంటుందేమో. లేకపోతే తమ హయాంలో జరిగిన మంచిపనులుంటే వాటిని జనాటకు గుర్తుచేసినా పర్వాలేదు. ఇవేవీ కాకుండా హోదాను మాత్రమే పట్టుకుంటే నష్టమే ఎక్కువని గ్రహించాలి.