ఐసీఎంఆర్ కు సౌత్ ఇండియాపై సవతి తల్లి ప్రేమేనా?

Update: 2020-06-30 07:30 GMT
బర్రె గుడ్డిది అయితే ఏ చేనులో మేసినా ఫర్వాలేదన్నట్టుగా తయారైంది మన దేశంలో ఐసీఎంఆర్ పరిస్థితి అని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న రాష్ట్రాలు, నగరాలను విస్మరించి తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్) వివక్ష చూపడంపై దక్షిణాది వాసులు మండిపడుతున్నారు.

ఆది నుంచి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దక్షిణాదిపై చిన్నచూపే.. ఉత్తరాధి వారే దేశ పీఠంపై కూర్చోవడం.. కీలక మంత్రి పదవులు వారికే ఇవ్వడం.. దక్షిణాది వారిని పట్టించుకోకపోవడం లాంటి సామాజిక సమీకరణాల్లో వివక్ష కొనసాగుతోంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోని ఐసీఎంఆర్ కూడా అలాగే వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది.

ప్రస్తుతం దేశంలో కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఉందంటే అదీ మహారాష్ట్ర.. దాని రాజధాని ముంబై. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ. ఇక్కడ ఒక్కోచోటనే లక్షకు పైనే కేసులు నమోదయ్యాయి. అలాంటి వాటిని విడిచిపెట్టి తాజాగా ఐసీఎంఆర్ దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల జిల్లాలనే పేర్కొనడం దుమారం రేపింది.

తాజాగా ఐసీఎంఆర్ లాక్ డౌన్ సడలింపుల తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని వెల్లూరులో అత్యధికంగా దేశంలోనే 34.9శాతం రెట్లు కేసులు పెరిగినట్టు వెల్లడించింది.  ఆ తర్వాత బెంగళూరు 29.8శాతం, హైదరాబాద్ 27.7శాతం, ఫరీదాబాద్ 16.2శాతం, మధురై 11.4శాతం రెట్లు కేసులు పెరిగాయి.

ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అత్యధికంగా వ్యాపిస్తున్న ఉత్తరాదిలోని గురుగ్రామ్ లో 8.3శాతం, జల్ గాన్ లో 7.2శాతం, నాసిక్ 6.5శాతం, ఢిల్లీ 6.2శాతం, పాల్ ఘర్ లో 4.9శాతం రెట్లు కేసు నమోదైనట్టు తెలిపింది.

ఇప్పుడు దేశంలో ఎవరిని అడిగినా టాప్ కరోనా కేసులు మహారాష్ట్ర ముంబైలోనే నమోదవుతున్నాయని అంటారు. ఆ తర్వాత ఢిల్లీ ఉంది. వాటిని వదిలేసి దక్షిణాదిన ఉన్న వెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్ లో అత్యధిక కరోనా కేసులు అంటూ ఐసీఎంఆర్ పేర్కొనడం నవ్వుల పాలైంది. వివక్ష ఉండాలి కానీ వాస్తవాలు కళ్లముందు ఉన్నా కూడా దక్షిణాది ప్రాంతాలపై మరీ ఇంత అవాస్తవాలు ప్రచారం చేస్తారా అని ఐసీఎంఆర్ పై దక్షిణాది నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ముంబై, ఢిల్లీలో కేసులను తక్కువ చేసి చూపించడం.. హైదరాబాద్ లో పదివేల కేసులు లేకున్నా ఎక్కువ చేసి చూపించడం చేస్తున్న ఐసీఎంఆర్ వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కేసుల విషయంలోనూ ఏంటి కక్కుర్తి అని అందరూ నిలదీస్తున్నారు. 
Tags:    

Similar News