• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుకి ఆ హోదా ఇక...

చంద్రబాబుకి ఆ హోదా ఇక కష్టమేనా ..ఏ హోదా అంటే ?

By - Tupaki Desk
Update: 2019-11-23 11:13 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా హాట్ హాట్ గా సాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసినప్పటినుండి టీడీపీ , వైసీపీ మధ్య విమర్శల పర్వం పీక్ స్టేజ్ కి చేరింది. ఒకవైపు వంశీ , మరోవైపు మంత్రి కోడలి నాని టీడీపీ పై , అధినేత చంద్రబాబు పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే వీరిద్దరూ లోకేష్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారాయి. ఇదే సమయంలో మరోసారి ప్రధాన ప్రతిపక్ష అంశం తెరపైకి వచ్చింది.

మొన్నటి ఎన్నికల లో టీడీపీ  23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. అందులో ఒకరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి ..వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం టీడీపీలో ఉండే ఎమ్మెల్యేల సంఖ్య  22 . ఈ తరుణంలో మరో నలుగురు ఎమ్మెల్యే లని టీడీపీ నుండి లాగేస్తే టీడీపీ కి ప్రధాన ప్రతిపక్షం అన్న హోదా కూడా లేకుండా పోతుంది  అని కొందరు చర్చించుకుంటున్నారు. దీనితో మరోసారి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాపై చ‌ర్చ సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ విషయం పై స్పదించారు... మావాళ్లు చెపుతా ఉన్నారు. టీడీపీ నుంచి న‌లుగురునో.. ఐదుగురునో.. మ‌న‌లోకి లాగేసుకుంటే.. ఆ పార్టీ కి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌ద‌ని..అంటున్నారు అని జ‌గ‌న్ స‌భ‌లోనే చెప్పుకొచ్చారు. అయితే, తాను అందుకు సిద్ధం గా లేన‌ని, ఫిరాయింపుల‌ను తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రోత్స‌హించేది లేద‌ని, ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రిజైన్ చేయ‌కుండా పార్టీలు మారే వారిపై వేటు వేయాల‌ని, ఈ మేర‌కు పూర్తి స్వేచ్ఛ‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఇస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

దీంతో అప్ప‌ట్లో ఈ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ట‌యింది. అయితే, ఇప్పుడు తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీ కి రాజీనామా చేయ‌డం, వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం, మ‌రో న‌లుగురు నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప‌క్క‌ చూపులు చూస్తున్నార‌నే వార్త‌లు రావడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.  తాజాగా దీనిపై స్పందించిన చంద్ర‌బాబు..  నా ప్రతిపక్ష హోదాకు ఏ ఢోకా లేదు.. ఆ హోదాను కాపాడుకోవడం నాకు తెలీదా?, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకోవడం వారి భ్రమ.. ఇల్లు అలకగానే పండగకాదు.. వీరు హోదా ఇస్తేనే వచ్చిందా? ప్రజలు ఇస్తేనే వచ్చింది అని చెప్పారు.  వాస్తవానికి ఇది నిజం అయినప్పటికీ .. అసెంబ్లీలో ఏ పార్టీకైనా ప్ర‌తిప‌క్ష హోదా రావాలంటే.. రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో 10% సీట్ల‌ను ఆ పార్టీ కైవ‌సం చేసుకుని ఉండాల‌ని రాజ్యాంగం చెబుతోంది. ఈ లెక్కన ఏపీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు దక్కాలి అంటే ..కనీసం 18 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. ఆలా ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ పార్టీ ఇచ్చే వాయిదా తీర్మానాల‌ కు వాల్యూ ఉంటుంది.  అదేవిధంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం గా ఉన్న పార్టీ అధినేత‌కు లేదా ఫ్లోర్ లీడ‌ర్‌ కు కేబినెట్ హోదా ఉంటుంది. భారీ భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాలు, మంత్రితో స‌మానంగా అల‌వెన్సులు ల‌భిస్తాయి. అలా కాక‌పోతే.. సాధార‌ణ ఎమ్మెల్యే కు ఉండే గౌర‌వ‌మే ల‌భిస్తుంది. చూడాలి మరి ఏమౌతుందో ..
Tags:    
  • Chandra Babu 
  • Cbn Politics 
  • Chandra Babu Opposition Status 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Andhra Politics News 
  • Tupaki News 

Similar News

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS