కరోనా ఎఫెక్ట్ : బాల్కనీ లో ఐపీఎల్ స్టార్స్ !

Update: 2020-08-22 10:32 GMT
ఐపీఎల్ ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2020. ఈ ఏడాది అన్ని బాగున్నింటే ఈపాటికే ఈ సీజన్ ఐపీఎల్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయేది. కానీ , కరోనా మహమ్మారి రాకతో అన్ని మారిపోయాయి. అసలు ఐపీఎల్ ఈ ఏడాది ఇక కష్టమే అని అనుకున్నారు. కానీ , ఐపీఎల్ అభిమానులకి కావాల్సిన వినోదాన్ని అందివ్వడానికి ఐపీఎల్ అన్ని హంగులతో సిద్ధమైంది. బీసీసీఐ చైర్మన్ గంగూలీ ఐపీఎల్ జరగడానికి మార్గం సుగమం చేశారు. దీనితో సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ఐపీఎల్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే , ఢిల్లీ , హైదరాబాద్ జట్లు తప్ప మిగిలిన అన్ని జట్లు కూడా యూఏఈ లో ల్యాండ్ అయ్యాయి.

అయితే , గతంలో క్రికెట్‌ ఆడేందుకు ఏ దేశం వెళ్లినా కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని కాసేపు కసరత్తు చేసి ఎంచక్కా సిమ్మింగ్ ఫుల్ లో సేద తీరేవారు. అంతా కలిసి ఇష్టమైన రుచుల్ని ఆస్వాదించేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ‌లు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో అవన్నీ కూడా మారిపోయాయి. కలిసి తిరిగే పరిస్థితి కాదు , కనీసం హోటల్ రూమ్ నుండి  కాలు బయటపెట్టే పరిస్థితి కూడా లేదు.  ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌ వెళ్లిన క్రికెటర్లు అక్కడ హోటల్లో రాజస్తాన్, పంజాబ్‌ జట్లు ఆటగాళ్లు  క్వారంటైన్‌ అయ్యారు. అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్‌ గదులకే పరిమితమైన ఆటగాళ్లు... అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు కాసేపు మాట్లాడుతూ కనిపించారు. ఇక ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేస్తూ కాలం గడుపుతున్నారు. 
Tags:    

Similar News