క్రికెట్ ఫ్యాన్స్ కి అదిరిపోయే శుభవార్త .. సెప్టెంబరు 19 ఐపీఎల్ !

Update: 2020-07-24 12:43 GMT
ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్‌లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఐతే ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ టోర్నీ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. మ్యాచ్‌లను కుదించలేదని.. అన్ని మ్యాచ్‌లూ నిర్వహిస్తామని చెప్పారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ పోస్ట్ పోన్ చేయడంతో.. ఆ విండోలో ఐపీఎల్ 13వ ఎడిషన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ టోర్నీ యూఏఈలో సెప్టెంబర్ 19న ప్రారంభం కానుండగా.. 51 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ ఫైనల్ నవంబర్ 8న నిర్వహిస్తారు. లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది జట్లు ఆగష్టు 20 కల్లా యూఏఈకి చేరుకోనున్నాయి. వచ్చే వారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా.. చైర్మన్ ముందుగానే డేట్స్ అనౌన్స్ చేశారు. ఇక ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు ఛార్టెడ్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్ ఏర్పాట్లును ముమ్మరం చేస్తున్నాయిని . బీసీసీఐ గవర్నర్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మొత్తం 51 రోజుల పాటు లీగ్‌ను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయనున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News