మహాభారతంలో ధర్మరాజు తన భార్య ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడినట్లుగానే....కలియుగంలో ఓ భర్త తన భార్య మానాన్ని పణంగా పెట్టి జూదం ఆడాడు. ఆ జూదంలో ఓడిపోవడంతో ఇద్దరు వ్యక్తులకు తన ధర్మపత్నిని అప్పగించాడు. ఆ కలియుగ దుశ్శాసనులు ఆ భార్యను చెరబట్టారు. మహాభారతంలో ఘట్టాన్ని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ భర్త జూదమాడాడు. అందులో ఓడిపోవడంతో ఆమె భార్యను గెలిచిన వ్యక్తులకు అప్పగించాడు. వారిద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదుచేసింది. ప్రతి వారం పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో ఆమె తన బాధను వెల్లడించింది.
కొద్దికాలం క్రితం జరిగిన ఆ ఘటన తర్వాత తాను తన భర్త నుంచి విడిపోయానని ఆ మహిళ తెలిపింది. అయినప్పటికీ వాళ్లిద్దరూ తరచు తనను వేధిస్తున్నారని తెలిపింది. ఆమె ఫిర్యాదులో ఉన్నవారందరినీ విచారణ కోసం పిలిపించినట్లు ఇండోర్ మహిళా పోలీసు స్టేషన్ ఇన్ చార్జి జ్యోతిశర్మ చెప్పారు. ఆరోపణలను నిర్ధారించుకోకపోవడం వల్లే ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. నిజానిజాలు విచారించిన అనంతరం కేసు నమోదు చేసి ఆ మహిళకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.