• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియన్ ఐటీపై ట్రంప్ దాడి...

ఇండియన్ ఐటీపై ట్రంప్ దాడి మొదలైపోయిందా!

By - Tupaki Desk
Update: 2017-01-30 13:19 GMT
సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తీసుకోబోయే నెక్స్ట్ నిర్ణయం మరింత బలంగా తగలబోతుందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇండియన్ ఐటీ రంగానికి గట్టి దెబ్బ తగలొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం... హెచ్-1బీ వీసాలపై ట్రంప్ పడనున్నారని రిపోర్టులు వెలువడుతుండటమే! ఈ లెక్కప్రకారం ఈ వీసాలపై న్యాయబద్దంగా ఉంటున్న ఇమిగ్రేట్లపై కూడా కొరడా ఝుళిపించాలని ట్రంప్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి... "అమెరికన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్న వీసా" అనే పాయింట్ లేవనెత్తనున్నారట ట్రంప్.

తాజాగా వోక్స్ డాట్ కాం రిపోర్టుల ప్రకారం వైట్ హౌస్ కు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్ లు ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ లు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ లీకైన డ్రాఫ్టు ల్లో.. లీగల్ ఇమిగ్రేషన్ ను పరిమితం చేయడం, విదేశీ వర్కర్ వీసా ప్రొగ్రాం ను బలపర్చడం వంటివి ఉన్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకున్న నిర్ణయం "అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు అనుమతి" ని కూడా ట్రంప్ తుంగలోకి తొక్కే చర్యలు కనిపిస్తున్నాయట!

ట్రంప్ తీసుకోబోయే ఈ కొత్త నిర్ణయాల వల్ల సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విద్యార్థులు మరికొన్ని రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన "ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓటీపీ)" వర్తించకుండా పోయే అవకాశం ఉంది! ఈ క్రమంలో డిగ్రీ విద్యార్థులు మూడేళ్ల పాటు అమెరికాలో ఉండే హక్కును కలిగిఉన్న ఈ ఓటీపీ పొడిగింపు విషయంపై ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంతో 1,65,918 మంది భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతుంది. అయితే ఈ నిర్ణయాల విషయంలో అమెరికా-ఇండియా స్నేహం ఏమైనా భారతీయులకు అనుకూలంగా సహాయం చేయగలుగుతుందా.. లేక ట్రంప్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటె వందసార్లు నిర్ణయం తీసుకున్నట్లేనా అనేది వేచి చూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Indian techies 
  • students 
  • Trumps 
  • Telugu NEWs 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS