ఈ ఏడాది హజ్ యాత్ర ఉండదు ..వెల్లడించిన కేంద్రమంత్రి

Update: 2020-06-23 11:30 GMT
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఎదో ఒక విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఆరునెలల సమయం గడుస్తున్నా కూడా ..ఇదిగో మందు..అదిగో మందు అంటున్నారే తప్ప ..ఈ మహమ్మారికి ఇంకా సరైన మందు రాలేదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా ఈ వైరస్ ఎఫెక్ట్ ..హజ్ యాత్రికులకు తాకింది.

తాజాగా ఈ ఏడాది హజ్ యాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నగదు మొత్తం డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా,ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది అనుమతి లభించిన వారు అంతా 2021లో దానిని వినియోగించుకోవచ్చునని మంత్రి వివరించారు.

అయితే ఈ వైరస్ నేపథ్యంలో హజ్ యాత్రపై మొదటి నుంచి సంగ్ధిగ్ధత కొనసాగింది. హజ్ యాత్ర ఉండకపోవచ్చునని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై సౌదీ అరేబియా నుంచి సమాచారం కోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎదురుచూసింది. తాజాగా సౌదీ ప్రభుత్వమే వద్దని చెప్పడంతో యాత్రను రద్దు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Tags:    

Similar News