45 ఏళ్ల నాటి ఒప్పందానికి తూట్లు పొడిచేలా.. అక్కడ తూటా పేల్చిన డ్రాగన్
సరిహద్దుల్లో డ్రాగన్ దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరు భారత్ -చైనాల మధ్య ఉద్రిక్తతలను మరోస్థాయికి తీసుకెళుతోంది. గడిచిన కొన్ని నెలలుగా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్రరూపం దాల్చటమే కాదు.. తామేం చూసినా చూసీచూడనట్లుగా భారత్ ఉండాలన్న బరితెగింపు చైనాలో ఎక్కువ అవుతోంది. గతానికి భిన్నంగా డ్రాగన్ బెదిరింపులకు బెదిరిపోకుండా.. ఎక్కువ చేస్తే.. షాకులు తప్పవన్నట్లుగా వ్యవహరిస్తున్న భారత్ తీరు ఆ దేశానికి ఇప్పుడు చికాకు పెట్టిస్తున్నాయి.
సోమవారం అర్థరాత్రి వేళలో సరిహద్దుల్లో చైనా సైనికులు గాల్లో పేల్చిన తూటాలతో 45 ఏళ్ల క్రితం నాటి శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచాయని చెప్పాలి. అప్పట్లో కూడా.. చైనా సైనికులే కాల్పులు జరపటం గమనార్హం. ఇటీవల కాలంలో వాస్తవాధీన రేఖను మార్చాలన్న కుటిల యత్నం అంతకంతకూ పెరుగుతోంది. దశాబ్దాల నాటి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. గాల్లోకి కాల్పులు జరపటం ద్వారా వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పక తప్పదు.
1975లో చైనాకు చెందిన సైనికులు భారత సరిహద్దుల్లోకి చొరబడ్డారు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాల్పులు జరపగా.. ఈ ఉదంతంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన ఒప్పందాలకు తూట్లు పొడిచేలా సోమవారం పాంగాంగ్ సరస్సు వద్ద తూటాలును మరోసారి పేల్చింది చైనా. ఎందుకిదంతా చేస్తుందన్న విషయంలోకి వెళితే.. రక్షణ రంగానికి చెందిన ప్రముఖులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు.
ఆగస్టు 29న భారత్ తన భూభాగంలోని కీలక పర్వతాలపై పట్టు సాధించిన వైనాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. పాంగాంగ్ సరస్సు కీలకమైన ఫింగర్ 4కు వ్యతిరేక దిశలో ఉండే ఈ పర్వత ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. ఎందుకంటే.. ఈ శిఖరాలపై నుంచి స్పంగూర్ సరస్సు.. చుట్టుపక్కల మైదాన ప్రాంతాల నుంచి చైనా సైనికులు భారత భూభాగాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే ఇట్టే గుర్తించే వీలుంది. అందుకే.. ఈ ప్రాంతాన్ని భారత్ అధీనంలో ఉండటాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఇందులో భాగంగానే.. తాజా కాల్పులకు తెగ బడుతోందన్న వాదన వినిపిస్తోంది.